Crime: ఎవరినైనా చంపి జైలుకు వెళ్తేనే.. స్కూలుకు వెళ్లే బాధ తప్పుతుంది.. ఇదీ ఆ 16 ఏళ్ల బాలుడి ఆలోచన.. చివరకు..

ABN , First Publish Date - 2022-08-23T21:09:01+05:30 IST

ఆ పదహారేళ్ల బాలుడు పదో తరగతి చదువుతున్నాడు.. రోజు స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బంది పడేవాడు..

Crime: ఎవరినైనా చంపి జైలుకు వెళ్తేనే.. స్కూలుకు వెళ్లే బాధ తప్పుతుంది.. ఇదీ ఆ 16 ఏళ్ల బాలుడి ఆలోచన.. చివరకు..

ఆ పదహారేళ్ల బాలుడు పదో తరగతి చదువుతున్నాడు.. రోజు స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బంది పడేవాడు..  తల్లిదండ్రులు ఆ బాలుడిని కొట్టి, తిట్టి పాఠశాలకు పంపించేవారు.. దీంతో పాఠశాలకు వెళ్లకుండా ఉండేందుకు ఆ బాలుడు దారుణమైన ప్లాన్ వేశాడు.. తన స్నేహితుడి గొంతు కోసి చంపేశాడు.. ఎవరినైనా హత్య చేస్తే జైలులో పెడతారని, అప్పుడు స్కూలుకు వెళ్లే బాధ తప్పుతుందనేది అతడి ఆలోచన.. ఆ బాలుడు చెప్పింది విని పోలీసులు కూడా షాకయ్యారు. 


ఇది కూడా చదవండి..

తెల్లవారుజామున అలికిడి.. నిద్రలేచి చూసిన 10 ఏళ్ల కూతురికి కనిపించిన దృశ్యం చూసి మైండ్‌బ్లాక్.. అరిస్తే చంపేస్తానంటూ..


ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఘజియాబాద్‌‌కు చెందిన నీరజ్ అనే 13 ఏళ్ల విద్యార్థి మృతదేహం సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే కింద లభ్యమైంది. నీరజ్‌ను ఎవరో గొంతు కోసి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆకాష్‌నగర్ ఫేజ్-2లో నీరజ్ నివాసం ఉంటున్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి విచారించారు. నీరజ్ చివరిసారిగా తన స్నేహితుడైన 16 ఏళ్ల బాలుడితో కనిపించినట్లు తెలిసింది. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్య చేసినట్లు అంగీకరించాడు. చదువుకోవాలని తల్లిదండ్రులు చేస్తున్న ఒత్తిడిని భరించలేక, జైలుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిందితుడు చెప్పాడు. 


ఈ హత్యకు నెల రోజుల ముందే పథకం వేశాడు. అంతేకాదు జైలులో జీవితం ఎలా ఉంటుంది, భోజన సౌకర్యాలు ఎలా ఉంటాయని కూడా ఇంటర్నెట్ ద్వారా సమాచారం సేకరించాడు. తన స్నేహితుడైన నీరజ్‌ను హత్య చేసేందుకు నిందితుడు నిర్ణయించుకున్నాడు. స్పాట్ నిర్ణయించి రోజూ అక్కడకు తీసుకెళ్లేవాడు. రెండు సార్లు ప్రయత్నించి చంపలేకపోయాడు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత నీరజ్‌ను నిందితుడు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కిందకు తీసుకెళ్లాడు. ఖాళీ బీరు సీసా పగలగొట్టి, నీరజ్ గొంతు కోశాడు. దీంతో నీరజ్ మెడ నుంచి రక్తం కారడం మొదలైంది. కొద్ది సేపటికి నీరజ్ మరణించాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. 

Updated Date - 2022-08-23T21:09:01+05:30 IST