తెలివైన బాలుడు!

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

ఒక బాలుడు ఊరిలోంచి నడుస్తూ అడవిలోకి వెళ్లిపోయాడు. మామిడి చెట్టు దగ్గరికెళ్లాడు. కిందపడిన మామిడి పండ్లను ఏరుకుంటున్నాడు. ఇంతలోనే దగ్గరగా........

తెలివైన బాలుడు!

ఒక బాలుడు ఊరిలోంచి నడుస్తూ అడవిలోకి వెళ్లిపోయాడు. మామిడి చెట్టు దగ్గరికెళ్లాడు. కిందపడిన మామిడి పండ్లను ఏరుకుంటున్నాడు. ఇంతలోనే దగ్గరగా.. ‘కాపాడండి’అనే ధ్వని వినిపించింది. పక్కకు చూస్తే ఓ బాటిల్‌.. అందులో వింత జీవి కనిపించాడు. ‘నన్ను విడిపించు’ అంటూ వేడుకున్నాడు. గాజు సీసా బిరడాను తీసేశాడా బాలుడు. వెంటనే ఆ వింతజీవి బయటికొచ్చింది. ‘ఓ మంత్రగాడు నన్నిలా బంధించాడు. నీవల్ల బయటపడ్డాను. నిన్ను తినేస్తా’ అన్నది. ఆ బాలుడు ఖంగుతిన్నాడు. భయాన్ని లోపలే దాచుకున్నాడు. ‘నేను కలిసిన వారిలోకెల్లా అతి పెద్ద అబద్ధాల కోరువి నువ్వు. ఇంత భారీ రూపం అంత చిన్న గాజుసీసాలో ఎలా సరిపోయింది?’ అంటూ నవ్వాడు. ‘ఇదిగో చూడు’ అంటూ ఆ వింత జీవి సీసాలోకి వెళ్లింది. వెంటనే ఆ సీసాకి మూతపెట్టాడు. సీసా లోపలనుంచి ‘బాబూ.. నన్ను కాపాడు. నా బుద్ధి సరిగాలేదు. నిన్ను తినాలనుకోవడం పాపం. నా మూర్ఖత్వం’ అంటూ ఏడ్చింది. ఆ పిల్లవాడు ఏమీ మాట్లాడలేదు. ‘నా దగ్గర ఓ మంత్రదండం ఉంది. అది ఎలాంటి గాయాలనైనా మాన్పుతుంది. దేన్నైనా బంగారంగా మార్చొచ్చు’ అన్నాడు. ఆ బాలుడు అవేమీ పట్టించుకోకుండా ఆ బాటిల్‌ను చెట్ల పొదల మధ్య ఉంచేసి మామిడిపండు తింటూ ఇంటికెళ్లిపోయాడు.

నీతి: దుష్టులకు దూరంగా ఉండాలి.

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST