నా కోసం వెతకొద్దు.. ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టి బాలుడి అదృశ్యం
ABN , First Publish Date - 2020-09-10T12:20:28+05:30 IST
నా కోసం వెతకొద్దని బాబాయ్‌కి ఫేస్‌బుక్‌లో మెసేజ్‌పెట్టి ఓ బాలుడు అదృశ్యమయ్యాడు.
హైదరాబాద్/హయత్‌నగర్ : నా కోసం వెతకొద్దని బాబాయ్‌కి ఫేస్‌బుక్‌లో మెసేజ్‌పెట్టి ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. హయత్‌నగర్ మైత్రిభవన్ కాలనీలో నివసిస్తున్న రాగిపాటి శివయ్య కుమారుడు నవీన్‌కుమార్(16) మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. నాకోసం వెతకొద్దని 3 గంటలకు బాబాయ్‌కు ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టాడు. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో సోదరుడు వినయ్‌కుమార్ హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.