వాంతి చేసుకుందామని బస్సు కిటికీలోంచి తల బయటకు పెట్టాడు.. కానీ ఊహించని విషాదం

ABN , First Publish Date - 2022-04-21T21:35:15+05:30 IST

ఘజియాబాద్ : అమ్మానాన్నలకు నవ్వుటూ టాటా చెప్పి స్కూల్‌ బస్ ఎక్కిన 9 ఏళ్ల బాలుడు విషాదకర రీతిలో ప్రాణాలు వదిలిన ఘటన ఢిల్లీలో ఘజియాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.

వాంతి చేసుకుందామని బస్సు కిటికీలోంచి తల బయటకు పెట్టాడు..  కానీ ఊహించని విషాదం

ఘజియాబాద్ : అమ్మానాన్నలకు నవ్వుతూ టాటా చెప్పి స్కూల్‌ బస్ ఎక్కిన 9 ఏళ్ల బాలుడు విషాదకర రీతిలో ప్రాణాలు వదిలిన ఘటన ఢిల్లీలోని ఘజియాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. 4వ తరగతి విద్యార్థి అనురాగ్ భరద్వాజ్ స్కూల్ బస్‌లో వెళ్తుండగా వికారంగా అనిపించి బస్ కిటికీ తెరిచాడు. కొద్ది సేపటి తర్వాత వాంతి వస్తున్నట్టుగా అనిపించి కిటికీలోంచి తల బయటకు పెట్టాడు. దురదృష్టవశాత్తూ సరిగ్గా సమయంలో బస్సు పెద్ద మలుపు తిరిగింది. దీంతో రొడ్డు పక్కనే ఉన్న కరెంట్ స్థంభానికి బాలుడి తల బలంగా తగిలింది. తీవ్ర గాయాలపాలైన బాలుడు చనిపోయాడు. బస్సు ఎక్కే సమయంలో బాలుడు బాగానే ఉన్నాడు. బస్సు విద్యార్థులతో కిక్కిరిసిపోయి ఉండడంతో బాలుడికి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగివుండవచ్చునని, అందుకే తల బయటకు పెట్టివుంటాడని బాలుడి తల్లిదండ్రులు విలపించారు.


ఉదయం 6:42 గంటలకు బాలుడు బస్సు ఎక్కగా.. 7:15 గంటలకు స్కూల్ యజమాన్యం నుంచి తమకు సమాచారం అందిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదం జరిగిన మోడీ నగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించామని యాజమాన్యం చెప్పింది. చికిత్స కోసం మీరట్ హాస్పిటల్‌కు తరలించాలని కోరాం. ఉదయం 8:30 గంటల సమయంలో హాస్పిటల్‌కు చేరుకున్నాం. కానీ అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు వెల్లడించారని చెప్పారు. స్కూల్ బస్సు ఓనర్, స్కూల్ ప్రిన్సిపల్, బస్సు డ్రైవర్, ఇతర స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌తోపాటు హెల్పర్ కూడా ఘటనా స్థలం నుంచి పారిపోయారు. కానీ కొద్దిగంటల వ్యవధిలోనే ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ స్కూల్ బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోవడంతో అక్టోబర్ 2021లో బ్లాక్ లిస్టులో పెడుతున్నట్టు ఆర్‌టీవో ప్రకటించినట్టు పోలీసులు బయటపెట్టారు. 

Updated Date - 2022-04-21T21:35:15+05:30 IST