Abn logo
May 13 2021 @ 11:46AM

బిందెలో తల పెట్టిన బాలుడు

కరీంనగర్: కరోనా మహమ్మారి కారణంగా స్కూలు లేకపోవడంతో పిల్లలు ఇంటి వద్దే ఉండి చిత్రవిచిత్రాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం గ్రామంలో ఓ బాలుడు బిందెలో తల పెట్టాడు. ఎంతకీ తల బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు హైరానా పడ్డారు. కటింగ్ మెషీన్‌తో బిందెను కోసి తలను బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.


Advertisement
Advertisement
Advertisement