ఇంట్లోకి దూరి మరీ ప్రేయసి ముక్కు, జుట్టు కత్తిరించిన ప్రియుడు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-20T01:16:51+05:30 IST

గుజరాత్‌లో ఓ మహిళ వివాహేతర సంబంధం.. చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. ప్రియురాలి మీద కోపం పెంచుకున్న ప్రియుడు ఓ రోజు ఇంట్లోకి దూరి ఆమె ముక్కు, జుట్టు కత్తిరించాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఇంట్లోకి దూరి మరీ ప్రేయసి ముక్కు, జుట్టు కత్తిరించిన ప్రియుడు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
చికిత్స పొందుతున్న బాధితురాలు

సవ్యంగా సాగుతున్న సంసారాన్ని కొందరు చేజేతులా నాశనం చేసుకుంటూ ఉంటారు. దంపతుల్లో ఎవరో ఒకరు చేసే తప్పులు.. చివరకు వైవాహిక జీవితాన్ని ఛిన్నాబిన్నం చేస్తుంటాయి. గుజరాత్‌లో ఓ మహిళ వివాహేతర సంబంధం.. చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. ప్రియురాలి మీద కోపం పెంచుకున్న ప్రియుడు ఓ రోజు ఇంట్లోకి దూరి ఆమె ముక్కు, జుట్టు కత్తిరించాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


గుజరాత్ రాజ్‌కోట్ జిల్లా ధోరాజీకి చెందిన వివాహిత.. భర్త, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తూ ఉండేది. అయితే కుటుంబంలో ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. సమస్యలతో సతమతమవుతున్న సమయంలో వివాహితకు సుల్తాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. చనువుగా ఉండడంతో ఆమె తన ఇంట్లోని సమస్యలన్నీ అతడికి చెప్పేది. ఈ క్రమంలో ఓదార్పు పేరుతో ఆమెకు బాగా దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పెళ్లి పేరుతో నమ్మించడంతో భర్త, పిల్లలను వదిలి సుల్తాన్‌తో వెళ్లిపోయింది.

కొద్ది రోజుల్లో పెళ్లి.. డాబా మీద దుస్తులు ఆరేద్దామని వెళ్లిందా 20 ఏళ్ల యువతి.. ఊహించని రీతిలో..


అప్పటికే పెళ్లయిన సుల్తాన్.. మొదట ఈ విషయాన్ని మహిళ వద్ద దాచి పెట్టాడు. తర్వాత తెలియడంతో సుల్తాన్‌ను ఆమె నిలదీసింది. మొదటి భార్యకు విడాకులు ఇస్తానని చెప్పి నమ్మించాడు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేసే సుల్తాన్.. రోజూ ఆమెను వివిధ సాకులు చూపి వేధించేవాడు. దీంతో కొన్నాళ్లకు ఆమె.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న సుల్తాన్.. తన స్నేహితుడైన రాహుల్‌ను తీసుకుని ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ప్రియురాలి ముక్కు, వెంట్రుకలను కత్తిరించి పరారయ్యాడు. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సుల్తాన్, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

చెల్లి మృత దేహం వద్ద విలపిస్తూ కూర్చున్న అన్నయ్య.. ‘‘ఎలా చనిపోయిందో తెలుసా..?’’ అంటూ పక్కింటి వాళ్లు చెప్పింది విని..

Updated Date - 2022-02-20T01:16:51+05:30 IST