Abn logo
Oct 27 2020 @ 20:19PM

బర్త్‌డే పార్టీలో విషాదం.. మూడేళ్ల బాలుడు..

Kaakateeya

హ్యూస్టన్: అమెరికాలోని హ్యూస్టన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల బాలుడు తన బర్త్‌డే పార్టీలో తనను తాను తుపాకీతో కాల్చుకుని మృత్యువాతపడ్డాడు. హ్యూస్టన్‌కు 40 కిలోమీటర్ల దూరంలో గల పోర్టర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అతిథులందరూ పార్టీలో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్ధం వినిపించింది. దాంతో వారు వెంటనే వెళ్లి చూశారు. అప్పటికే బాలుడు తన ఛాతిలో తుపాకీతో కాల్చుకుని రక్తపుమడుగులో పడి ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్న బాలుడ్ని హూటాహూటిన చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు కొద్దిసేపటి తర్వాత మృతిచెందాడు. పుట్టినరోజున కుమారుడు దూరం కావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే, పార్టీకి వచ్చిన అతిథులలో ఎవరో ఒకరి తుపాకీ కిందపడడంతో దానిని బాలుడు తీసుకుని కాల్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోర్టర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement