విద్యుదాఘాతానికి బాలుడి బలి

ABN , First Publish Date - 2021-07-31T05:43:32+05:30 IST

కుటుంబానికి చేదోడుగా నిలు స్తున్న అన్నదమ్ములు విద్యుదాఘాతానికి గురయ్యారు.

విద్యుదాఘాతానికి బాలుడి బలి
ప్రవీణ్‌ (ఫైల్‌)

జంగారెడ్డిగూడెం, జూలై 30: కుటుంబానికి చేదోడుగా నిలు స్తున్న అన్నదమ్ములు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటన లో తమ్ముడు మృతి చెందగా అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి బంధువుల వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం  మండ లంలోని చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో నిర్మిస్తున్న గృహాలకు రంగులు వేసేందుకు కొయ్యలగూడెం మండలం సరిప ల్లికి చెందిన అన్నదమ్ములు అంబలి ప్రవీణ్‌, అఖిల్‌ వస్తున్నారు. శుక్రవారం ఒక ఇంటికి సున్నం వేస్తున్న సమయంలో తమ్ముడు ప్రవీణ్‌కు వైర్‌ తగిలి విద్యుదాఘాతానికి గురై పడిపోగా అన్న అఖిల్‌ తమ్ముడిని కాపాడే యత్నం లో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రవీణ్‌ సంఘటన స్థలంలోనే చనిపోయాడు. అఖిల్‌ను ఏలూరు ఆస్పత్రికి  తరలించారు. ప్రవీణ్‌ మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. మృతుడు ప్రవీణ్‌ తొమ్మిదో తరగతి,  అఖిల్‌ పదో తరగతి చదువుతున్నారు. 

==========

ఇన్‌స్పైర్‌కు నమూనాల నమోదు గడువు పెంపు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 30 : ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులకు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ఈ ఏడాది అక్టోబర్‌ 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు డీఈవో రేణుక తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలు వారి ఉపాయాలు/ నవ కల్పనలను నమూనా రూపంలో తయారు చేసి ఇ–ఎంఐఏఎస్‌ వెబ్‌సైట్‌లో పొందు పర్చాలని సూచించారు. ప్రతి పాఠశాల నుంచి ఐదు నమూనాలకు తక్కువ కాకుండా విద్యార్థులతో తయారు చేయించి సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని డీవైఈవోలు, ఎంఈఓలు, పట్టణ  పాఠశాలల ఉప తనిఖీ అధికారులను ఆదేశించారు. 

========

పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు

 ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 30: ప్రస్తుత విద్యా సంవత్సరానికి  అన్ని ప్రభుత్వ/ జడ్పీ/ మండల పరిషత్‌/ మునిసిపల్‌ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఇప్పటికే అన్ని మండల కేంద్రాలకు, పాఠశాలలకు సరఫరా చేసినట్టు డీఈవో రేణుక తెలిపారు. ఎంఈఓలు తమ పరిధిలోని పాఠశాలలకు ఇప్పటికీ పుస్తకాలు చేరవేయని పక్షంలో ఈ నెల 31వ తేదీ నాటికి తప్పనిసరిగా అందజేసేందుకు  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెచ్‌ఎంలు తమకు అందిన పుస్తకాలను టఛిజిౌౌజ్ఛూఛీఠ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో ఆగస్టు 2వ తేదీ నాటికి అప్‌లోడ్‌ చేయాలని, అదనంగా కావాల్సి వస్తే టైటిల్‌ వారీగా సంబంధిత ఎంఈఓకు ఇండెంట్‌ను ఇవ్వాలని కోరారు. పాఠశాలలు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకాలు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2021-07-31T05:43:32+05:30 IST