Abn logo
Sep 18 2021 @ 19:03PM

అనంతపురం జిల్లాలో బాలుడు దారుణ హత్య

అనంతపురం: జిల్లాలో దారుణం జరిగింది. నల్లమడ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన విగ్నేష్(12) అనే పన్నెండేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 12న విగ్నేష్‌ను గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కిడ్నాప్ చేసారు. దీంతో పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. వారం రోజుల తర్వాత కమ్మవారిపల్లి సమీపంలోని ఓ పాడుబడిన బావిలో విగ్నేష్ శవమై తేలాడు. గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కిడ్నాప్ చేసి విగ్నేష్‌ను చంపి వేశారంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.


విగ్నేష్ తండ్రి చంద్ర గ్రామంలోనే రైస్ మిల్లు నడుపుతున్నాడు. రైస్ మిల్లులో పనిచేస్తున్న చిన్న చౌడప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేసారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేసారు.  

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...