Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 12:50:25 IST

Prabhas - Hrithik : బాక్సాఫీస్ పోరు తప్పదా?

twitter-iconwatsapp-iconfb-icon

ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలు ఇక్కడ విడుదలైతే.. రెగ్యులర్ తెలుగు చిత్రాలకు అంతగా ఎఫెక్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. తెలుగు చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై.. బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. రెగ్యులర్ బాలీవుడ్ చిత్రాలకు సైతం గట్టిపోటీ ఇస్తూ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక క్రేజీ పాన్ ఇండియా చిత్రం బాలీవుడ్ స్టార్ హీరో సినిమాతో పోటీ పడుతూ విడుదలవుతోంది. ఆ సినిమాలు ప్రభాస్ (Prabhas) ‘సలార్’ (Salaar), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ‘ఫైటర్’ (Fighter). ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతుండడం హాట్ టాపిక్‌గా మారింది. 

ప్రభాస్,  శ్రుతి హాసన్ (Shruthi Haasan) జంటగా నటిస్తున్న ‘సలార్’ సినిమాకి ‘కేజీఎఫ్’ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. హోం బలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ‘సలార్’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. చిత్రీకరణ చివరిదశలో ఉంది. మరికొద్దిరోజుల్లో టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోతుంది. ‘రాధేశ్యామ్’ (Radheshyam) చిత్రంతో నిరాశ చెందిన అభిమానులకు.. ‘సలార్’ చిత్రంతో ఫుల్ మాస్ ఫీస్ట్ ఖాయమని నిర్మాతలు చెబుతున్నారు. 

ఇక అదే సెప్టెంబర్ 28న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ చిత్రం విడుదల కాబోతోంది. ఆ విషయాన్ని నిర్మాతలు ఎప్పుడో ప్రకటించారు. దీపికా పదుకొణే (Deepika Padukone) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సిద్ధా్ర్ధ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ సైనికుడిగా నటిస్తున్నాడు. సైనికుల వీరత్వాన్ని చాటిచెప్పే కథాంశంతో హైఓల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా ప్రభాస్ ‘సలార్’ తో పాటు విడుదలైతే.. గట్టిపోటీ తప్పదని వేరే చెప్పాలా? అయితే భారీ యాక్షన్ చిత్రంగా ఇంకా పట్టాలే ఎక్కని హృతిక్ ఫైటర్ మూవీ ప్రకటించిన తేదీలో విడుదలవడం కష్టమని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. మరి ఫైటర్ చిత్రం నిజంగానే సలార్ విడుదలైన రోజునే వస్తుందో రాదో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement