Abn logo
Feb 22 2020 @ 01:44AM

బాక్సింగ్‌ వర్సెస్‌ అడిమురై!

Kaakateeya

లోకంలో కిక్‌ బాక్సింగే నంబర్‌ వన్‌ స్పోర్ట్‌ అనీ, అందులో తన కుమారుడితో తలపడే గట్స్‌ ఇండియాలో ఎవరికీ లేవనీ విర్రవీగే విలన్‌కి ప్రాచీన తమిళ యుద్ధవిద్య అడిమురైతో లోకల్‌ బాయ్‌ లాంటి హీరో ఎటువంటి సమాధానం చెప్పాడు? లోకల్‌ బాయ్‌ ప్లాన్‌ ఏంటి? అనేది ఈ నెల 28న థియేటర్లలో చూడమని సీహెచ్‌ సతీష్‌కుమార్‌ అన్నారు. ధనుష్‌ హీరోగా, మెహరీన్‌, స్నేహ హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా ‘పటాస్‌’. ఆర్‌ఎస్‌ దురై సెంథిల్‌కుమార్‌ దర్శకుడు. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మాతలు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘లోకల్‌ బాయ్‌’గా వస్తోంది. ఈ నెల 28న శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ కుమార్‌ విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘అడిమురై గొప్పతనాన్ని వివరిస్తూ మార్షన్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ధనుష్‌ ద్విపాత్రాభినయం చేశారు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ, కథనాలు ఉంటాయి’’ అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement