Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముగిసిన బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ

విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 8: జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని సెంట్రల్‌ పార్కు వద్ద జరిగిన జిల్లా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు బుధవారం ముగిశాయి. స్వర్ణభారతి జట్టు 30 పాయింట్లతో చాంపియన్‌ ట్రోఫీని కైవసం చేసుకోగా, రాకీ బాక్సింగ్‌ జట్టు 18 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. బెస్ట్‌ బాక్సర్‌గా పి.అప్పలరాజు, లూజర్‌గా టి.నాగేంద్రబాబు, ప్రామినెంట్‌ బాక్సర్‌గా శ్రీనివాస్‌ నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర ముఖ్యఅతిథులుగా హాజరై  విజేతలకు ట్రోఫీ, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ బాక్సింగ్‌ క్రీడకు విశాఖలో విశేష ఆదరణ, ప్రోత్సాహం వుందని, క్రమశిక్షణతో సాధన చేసి ఉన్నత స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కట్టుమూరి సతీశ్‌, రాష్ట్ర ఫిషింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు, టోర్నీ నిర్వాహకులు మామిడి శ్రీను, నీలి రవి, రామారెడ్డి, మద్ది రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement