Abn logo
Mar 2 2021 @ 01:05AM

ఓడపై విజేందర్‌ బౌట్‌

న్యూఢిల్లీ: ఓటమి ఎరుగని భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తర్వాతి బౌట్‌ గోవాలో జరగనుంది. ఈ నెల 19న జరిగే బౌట్‌కు షిప్‌ డెక్‌ వేదిక కానుండడం విశేషం. గోవా తీరంలో నిలిచి ఉన్న మెజిస్టిక్‌ కాసినో ప్రైడ్‌ పైభాగంలో ఫైట్‌ జరగనుంది. అయితే, ప్రత్యర్థి ఎవరనేది త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. చివరిసారిగా 2019 నవంబరులో దుబాయ్‌లో జరిగిన పోరులో ఘనా బాక్సర్‌ చార్లెస్‌ అడముపై గెలిచిన విజేందర్‌.. వరుసగా 12వ విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు. 


Advertisement
Advertisement
Advertisement