Abn logo
Sep 21 2021 @ 00:16AM

ఫైనల్లో హుసాముద్దీన్‌

బళ్లారి: తెలుగు బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌ జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఫైనల్‌కు దూసుకుపోయాడు. దీంతో అతడు వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప బెర్త్‌ దక్కించుకొనేందుకు ఒక్క బౌట్‌ దూరంలో నిలిచాడు. తెలంగాణకు చెందిన హుసాముద్దీన్‌ సోమవారం జరిగిన 57 కిలోల హోరాహోరీ సెమీస్‌లో 4-1తో సచిన్‌ (హరియాణా)పై గెలిచాడు. మంగళవారం జరిగే స్వర్ణ పతక పోరులో రోహిత్‌ మోర్‌ (ఢిల్లీ)తో అమీతుమీ తేల్చుకుంటాడు. ఈ టోర్నీలో స్వర్ణ పతకం గెలిచే బాక్సర్లు వచ్చేనెల్లో సెర్బియాలో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.