కరోనా నుంచి కోలుకున్న డింకో

ABN , First Publish Date - 2020-07-04T08:42:13+05:30 IST

అంతర్జాతీయ మాజీ బాక్సర్‌ డింకో సింగ్‌ కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నాడు. నెల రోజులుగా న్యూఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స ..

కరోనా నుంచి కోలుకున్న డింకో

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మాజీ బాక్సర్‌ డింకో సింగ్‌ కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నాడు. నెల రోజులుగా న్యూఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న డింకోకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. దీంతో డింకో ఇంఫాల్‌లో తన ఇంటికి చేరుకున్నాడు. అయితే, వైద్యుల సలహా మేరకు అతడు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఇక, డింకో కొన్నేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-04T08:42:13+05:30 IST