బౌలర్లకు కనీసం.. రెండు నెలల ప్రాక్టీస్ కావాలి: ఐసీసీ

ABN , First Publish Date - 2020-05-23T19:44:25+05:30 IST

కరోనా లాక్‌డౌన్ ముగిసి.. మళ్లీ క్రికెట్ ప్రారంభమైన తర్వాత టెస్టుల్లో పాల్గొనాలంటే బౌలర్లకు కనీసం.. రెండు లేదా మూడు నెలల ప్రాక్టీస్ ఉండాలని

బౌలర్లకు కనీసం.. రెండు నెలల ప్రాక్టీస్ కావాలి: ఐసీసీ

దుబాయ్: కరోనా లాక్‌డౌన్ ముగిసి.. మళ్లీ క్రికెట్ ప్రారంభమైన తర్వాత టెస్టుల్లో పాల్గొనాలంటే బౌలర్లకు కనీసం.. రెండు లేదా మూడు నెలల ప్రాక్టీస్ ఉండాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని క్రీడలతో పాటు క్రికెట్ కూడా మార్చి నెల నుంచి జరగడం లేదు. అయితే ఇప్పుడు క్రికెట్ మళ్లీ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూలైలో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్.. ఆ తర్వాత ఆగస్టులో పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ నుంచి వచ్చిన ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 


శుక్రవారం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో చాలాకాలంగా ఆటకి దూరంగా ఉంటున్న బౌలర్లు.. గాయాలపాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఐసీసీ పేర్కొంది. ఎక్కువ మంది సభ్యులతో.. ఎనిమిది లేదా 12 వారాల ప్రాక్టీస్‌ బౌలర్లతో చేయించాలని ఐసీసీ అన్ని బోర్డులకు సూచించింది. ఆరు వారాల సమయంలో ప్రాక్టీస్ చేసిన బౌలర్లు 50 ఓవర్ల ఫార్మాట్‌లో లేదా అంతకంటే చిన్నది.. టీ-20 ఫార్మాట్‌లో ఆడగలరని తెలిపింది. టెస్టుల్లో ఆడాలంటే.. అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ అవసరమని పేర్కొంది. 

Updated Date - 2020-05-23T19:44:25+05:30 IST