బోయినపల్లి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2021-01-07T20:05:11+05:30 IST

బోయినపల్లి కిడ్నప్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.

బోయినపల్లి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో హాఫీజ్‌పేట్ భూముల్ని భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి కలిసి దక్కించుకున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత సుబ్బారెడ్డి ఈ వ్యవహారాన్ని డీల్ చేశారు. కిడ్నాప్ యత్నం తర్వాత పోలీసులు కేసులో ఏ1ను వదిలేసి ఏ2ను మాత్రమే అరెస్టు చేశారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ భూమి వివాదం కొనసాగుతోంది. అందులో భాగంగానే కిడ్నాప్ జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్ అంశాన్నే తెరపైకి తీసుకువస్తున్నారు తప్ప.. 50 ఎకరాల భూమి ఎవరికి సంబంధించింది.. ఎంత మంది భాగస్వాములు ఉన్నది, ఎన్నాళ్ల క్రితం ఈ భూమి కొనుగోలు చేసిందీ, ఎవరి పేరుతో డాక్యుమెంట్స్ ఉన్నదీ క్లారిటీ రవాల్సిన అవసరం ఉంది. ఏడాది క్రితం ఏవీ సుబ్బారెడ్డిపై ట్రెస్ పాస్ కేసు నమోదయింది. ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని నిన్న మూడు గంటలపాటు విచారించి అతనిని పోలీసులు విడిచిపెట్టి.. ఏ2గా ఉన్న అఖిలప్రియను అరెస్టు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 

Updated Date - 2021-01-07T20:05:11+05:30 IST