అమరావతి: టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదని మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ విలువలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలు బహిష్కరణ అంటే నామినేషన్లకు ముందే తెలియజేయాలన్నారు. ఎన్నికల తీర్పు స్పూర్తితో ప్రజల సేవకు సీఎం జగన్ పునరంకితమవుతారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తారని ప్రకటించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేస్తే.. తానూ చేస్తానని ప్రకటించారు. టీడీపీ నేతలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.