Abn logo
Mar 29 2020 @ 19:27PM

పట్టణ ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా ప్రబలుతోంది: బొత్స

విజయవాడ: పట్టణ ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా ప్రబలుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలను ప్రతిరోజు పరిశీలిస్తామన్నారు. సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో బొత్స సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించామని బొత్స తెలిపారు. అన్ని ప్రాంతాల్లో మార్కెట్‌లు పెట్టి జన సంచారం తగ్గిస్తామని, ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఆర్డీఏ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటింటి సర్వేలో టీచర్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనాధలు, యాచకుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement