బోటీ చారు / దప్పడం

ABN , First Publish Date - 2020-09-19T19:12:58+05:30 IST

బోటీ ముక్కలు - రెండు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - రెండు, బెండకాయలు

బోటీ చారు / దప్పడం

కావలసినవి: బోటీ ముక్కలు - రెండు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - రెండు, బెండకాయలు - 8, చింతపండు పులుసు - ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాలపొడి - ఒక టీస్పూన్‌, గరంమసాలా - పావు టీస్పూన్‌, బియ్యప్పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - మూడు టీస్పూన్లు.


తయారీ: ముందుగా బోటీ శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో వేసి అయిదు కప్పుల నీళ్లు పోయాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మూతపెట్టి ఉడికించుకోవాలి. విడిగా ఒక మందపాటి గిన్నెలో పలుచగా చేసిన చింతపండు పులుసు, కాస్త పెద్దగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, రెండు అంగుళాల సైజులో కట్‌ చేసిన బెండకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు,  ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ఇవి సగం ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బోటీ ముక్కలు వేయాలి. ఇందులో నూనె, గరం మసాలా, కొత్తిమిర వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా అరకప్పు నీళ్లలో బియ్యప్పిండి వేసి కలిపి మరుగుతున్న చారులో వేసి ఉండలు కట్టకుండా కలపాలి. రెండు నిమిషాలు ఉడికి చిక్కబడిన తర్వాత ఉప్పు సరిచూసుకుని దింపేయాలి. ఇష్టముంటే నిమ్మకాయ పిండుకోవచ్చు.


Updated Date - 2020-09-19T19:12:58+05:30 IST