Abn logo
Sep 21 2020 @ 02:28AM

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

జీజీహెచ్‌ (కాకినాడ), సెప్టెంబరు 20: జిల్లాలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వివిధ కారణాలతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పెదపూడి మండలం ముక్తేశ్వరానికి చెందిన పడాల అభిషేక్‌ (5) శనివారం ఇంటి సమీపంలో ఆటలాడుతకుంటుండగా టాటా ఏస్‌ వాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. జగ్గంపేట మండలం మల్లిసాలకు చెందిన సింగంపల్లి శ్రీను (23) వ్యక్తిగత కారణాలతో శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఔట్‌పోస్ట్‌ పోలీసులు వివరాలు నమోదు చేసి సంబంధిత పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement