కాకినాడ రూపురేఖలు మారతాయి

ABN , First Publish Date - 2022-01-19T05:30:00+05:30 IST

ప్రణాళికబద్ధంగా కాకినాడ నగరాన్ని అభివృద్ది చేయనున్నామని, రెండు, మూడేళ్లలో కాకినాడ రూపు రేఖలు మారనున్నాయని రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

కాకినాడ రూపురేఖలు మారతాయి
ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి బొత్స

మంత్రి బొత్స సత్యనారాయణ
కార్పొరేషన్‌(కాకినాడ), జనవరి 19: ప్రణాళికబద్ధంగా కాకినాడ నగరాన్ని అభివృద్ది చేయనున్నామని, రెండు, మూడేళ్లలో కాకినాడ రూపు రేఖలు మారనున్నాయని రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కాకినాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.347.51 కోట్లతో పలు అభివృద్ధి పను లకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పార్లమెట్‌ సభ్యురాలు వంగా గీత, కలెక్టర్‌ సి.హరికిరణ్‌లతో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు పట్టణాలలో కాకినాడను గ్రీన్‌ సిటీగా ఎంపిక చేశారన్నారు. నాడు-నేడులో భాగంగా త్వరలో స్లమ్‌ క్లీన్‌ సిటీగా కాకినాడను తీర్చిదిద్దనున్నామన్నారు. శివారు ప్రాంతాలలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం, స్వచ్ఛ సర్వేక్షణ్‌, జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రీన్‌ సిటీలో పలు డివిజన్‌ల్లో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి కార్పొరేటర్లకు అవార్డులు, ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను  ఛాయా చిత్ర ఎగ్జిబిషన్‌ ద్వారా కమిషనర్‌ మంత్రికి వివరించారు.  ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, అనంతఉదయ్‌భాస్కర్‌, తోట త్రిమూర్తులు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరె డ్డి, జక్కంపూడి రాజా, జ్యోతుల చంటిబాబు, రాపాక వరప్రసాద్‌, పెండెం దొరబాబు, సత్తి సూర్యనారాయణరెడ్డి, నగర మేయర్‌ సుంకర శివప్రసన్న, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, స్మార్ట్‌ సిటీ చైర్మన్‌ అల్లి రాజబాబు, కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌, డిప్యూటీ మేయర్లు చోడిపల్లి సత్యప్రసాద్‌, మీసాల ఉదయ్‌కుమార్‌, కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:30:00+05:30 IST