Abn logo
Feb 14 2020 @ 19:54PM

పేదలకు ఇళ్ల పేరుతో చంద్రబాబు అవినీతి చేశారు: బొత్స

అమరావతి: పేదలకు ఇళ్ల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పోలవరంపై రివర్స్‌ టెండరింగ్‌తో రూ.800 కోట్లు ఆదా చేశామన్నారు. ఏ విధంగా దోచుకోవచ్చో కుటుంబరావు ప్రణాళికలు వేశారని, తన పీఎస్‌ అక్రమ లావాదేవీలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పారు. ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే జగన్‌ ప్రయత్నిస్తున్నారని, మూడు కంపెనీల్లో చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ ప్రమేయం ఉందని విమర్శించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒక వారం ఆగితే అంతా తెలుస్తుందన్నారు. ఏ రోజు అసెంబ్లీలో సీఎం జగన్ రాజధాని కోసం ప్రకటించారో.. ఆ రోజునే రాజధాని ప్రక్రియ మొదలైందన్నారు. ఎన్డీయేలో చేరే పరిస్థితి వస్తే తప్పకుండా వెళ్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement