UK PM Race: రిషి సునాక్‌ను టార్గెట్ చేసిన బోరిస్ జాన్సన్.. ఓటింగ్‌లో గెలవకుండా ఉండేందుకు భారీ స్కెచ్!

ABN , First Publish Date - 2022-07-16T18:18:53+05:30 IST

బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని పీఠానికి జరుగుతున్న ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ దూసుకుపోతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ తదుపరి ప్రధాని అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో భాగంగా జరిగిన ఓటింగ్‌లో మిగతా పోటీదారుల

UK PM Race: రిషి సునాక్‌ను టార్గెట్ చేసిన బోరిస్ జాన్సన్.. ఓటింగ్‌లో గెలవకుండా ఉండేందుకు భారీ స్కెచ్!

ఎన్నారై డెస్క్: బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని పీఠానికి జరుగుతున్న ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ దూసుకుపోతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ తదుపరి ప్రధాని అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో భాగంగా జరిగిన ఓటింగ్‌లో మిగతా పోటీదారుల కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తూ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఈ క్రమంలో బోరిస్ జాన్సన్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రిషి సునాక్ ఓటమికి బోరిస్ కుట్ర పన్నుతున్నారన్నది ఆ వార్త సారాంశం. 



పలు అబియోగాలు రావడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్.. రిషి సునాక్‌పై ఆగ్రహంగా ఉన్నారట. తాను పదవిని కోల్పోవడానికి రుషి సునాకే కారణమని భావిస్తున్న జాన్సన్.. భారత సంతతి వ్యక్తికి పదవి దక్కకుండా ఉండేందుకు చేయాల్సిన అన్ని ప్రయాత్నాలూ చేస్తున్నారట. ముఖ్యంగా సునాక్‌ను తప్ప.. వేరే ఎవరినైనా బలపర్చండని తన వర్గం ఎంపీలకు జాన్సన్ సూచించారట. అయితే.. ఈ వార్తలపై జాన్సన్ సన్నిహితుడు ఒకరు స్పందిస్తూ వాటిని ఖండించారు. అయితే.. రిషి సునాక్ మాత్రం తనకు ద్రోహం చేశాడనే బాధ మాత్రం జాన్సన్‌కు ఉందని స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-16T18:18:53+05:30 IST