జార్జ్ ఫ్లాయిడ్ హత్యను ఖండించిన బ్రిటన్ ప్రధాని

ABN , First Publish Date - 2020-06-04T03:21:22+05:30 IST

నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఖండించారు.

జార్జ్ ఫ్లాయిడ్ హత్యను ఖండించిన బ్రిటన్ ప్రధాని

లండన్: నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఖండించారు. అమెరికాలో చోటుచేసుకున్న సంఘటన భయంకరమైనది, క్షమించరానిదంటూ ఆయన పార్లమెంట్‌లో చెప్పారు. ప్రతిఒక్కరు జార్జ్ ఫ్లాయిడ్ ఏ విధంగా మరణించాడో చూశారని.. అమెరికాలో నిరసనకారుల పోరాటాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. అయితే నిరసనలు చట్టబద్దంగా, సహేతుకంగా జరగాలన్నారు. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడారా లేరా అన్న విషయాన్ని బోరిస్ జాన్సన్ ప్రస్తావించలేదు. కాగా.. తెల్ల పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మే 25న చనిపోయాడు. అమెరికాతో పాటు బ్రిటన్‌లో సైతం జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై నిరసనలు జరుగుతున్నాయి. బ్రిటన్‌లో ఆదివారం అనేక చోట్ల లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు 23 మందిని అరెస్ట్ చేశారు. బ్రిటన్‌లోని అమెరికా ఎంబసీల ముందు, మాంచెస్టర్, లివర్ పూల్ ఇలా అనేక నగరాల్లో బుధవారం కూడా ఆందోళనకారులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 

Updated Date - 2020-06-04T03:21:22+05:30 IST