బోసిపోయిన తహసీల్దార్‌ కార్యాలయం

ABN , First Publish Date - 2022-01-29T05:57:12+05:30 IST

స్థానిక తహసీల్దార్‌ కా ర్యాలయం ఏసీబీ దాడులతో శుక్రవారం బోసిపోయింది. క ళ్యాణదుర్గం మండల సర్వేయర్‌ హేమసుందర్‌ ఓ మహిళ నుంచి స్థలం సబ్‌డివిజన చేసే క్రమంలో రూ.1.40 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి ఏసీబీ అధికారులకు అడ్డంగా పట్టుబడిన విషయం తెలిసిందే.

బోసిపోయిన తహసీల్దార్‌ కార్యాలయం
అధికారులు లేక వెల వెలబోతున్న తహసీల్దార్‌ కార్యాలయం

కళ్యాణదుర్గం, జనవరి 28: స్థానిక తహసీల్దార్‌ కా ర్యాలయం ఏసీబీ దాడులతో శుక్రవారం బోసిపోయింది. క ళ్యాణదుర్గం మండల సర్వేయర్‌ హేమసుందర్‌ ఓ మహిళ నుంచి స్థలం సబ్‌డివిజన చేసే క్రమంలో రూ.1.40 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం రాత్రి ఏసీబీ అధికారులకు అడ్డంగా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈపరిణా మంతో రెవెన్యూ అధికారులు ఉలిక్కిపడ్డారు. పలువురు  అ ధికారులు రాత్రికిరాత్రే సెల్‌ఫోనలు స్విచఆఫ్‌ చేసుకుని ఇ తర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నట్లు స్థానిక ఉద్యోగు ల్లో విస్తృత చర్చసాగుతోంది. ఈక్రమంలో తహసీల్దార్‌ కా ర్యాలయంలో తహసీల్దార్‌తోపాటు ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు, ఇతర సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ప్రజల సందడి కూ డా అంతంతమాత్రంగానే ఉంది. కాగా సర్వేయర్‌పై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏడేళ్లుగా విధులు నిర్వహి స్తూ రైతులు, ప్రజల నుంచి లక్షల రూపాయల అక్రమాల కు పాల్పడి, ఆస్తులను కూడబెట్టారనే విమర్శలు లేకపోలే దు. నిత్యం ప్రైవేట్‌ సర్వే పనుల్లో నిమగ్నమై అక్రమ సం పాదన కోసం ఆరాటపడుతుండేవారని సహచర ఉద్యోగులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. స్కెచ, భూముల సబ్‌డివిజన, లేఔట్ల ఏర్పాటు, సర్వే, రికార్డులకు ఒక్కో పనికి ఓ రే టు కుదుర్చుకుని జేబులు నింపుకున్నాడని పలువురు రి యల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బాధితులు బాహాటంగా పెదవి విరుస్తున్నారు.


 మరోవైపు వివిధ శాఖల్లో పనిచేస్తూ ఇది వరకు అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఏసీబీ దెబ్బకు కార్యాలయాల్లో కనిపించకుండాపోయారని ఆయా శాఖల్లో చర్చ సాగుతోంది ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మండలపరిషత, పోలీస్‌ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు శుక్రవారం వివిధ కారణాలతో విధులకు హాజరుకాలేదని తెలుస్తోంది. పలువురు తహసీల్దార్లు, డీటీ, ఏఓ, ఎస్‌ఐ, సీఐ, ఆర్‌ఐ, వీఆర్‌ఓ, సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయ సిబ్బందిలో అలజడి రేగింది. అవినీతి ఆరోపణలున్న అధికారులు, సి బ్బంది ఆయా కార్యాలయాల్లో కనిపించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. 


20 ఏళ్లలో ఏసీబీ వలకు చిక్కిన 13 మంది అధికారులు

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 20 ఏళ్లలో 13 మంది అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. వీరిలో అధిక శాతం రె వెన్యూ అధికారులే ఉండడం గమనార్హం. 2001లో కళ్యాణదుర్గం తహసీల్దార్‌ సురే్‌షకుమార్‌, 2002లో వ్యవసాయాధికారి శంకరప్ప, 2003లో పంచాయతీరాజ్‌ జేఈ రియాజ్‌, 2004లో బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రం గ్రామ కార్యదర్శి రామాంజనేయులు, 2005లో కుందుర్పి సర్వేయ ర్‌ చంద్రశేఖర్‌, మలయనూరు గ్రామ కార్యదర్శి గోవిందగౌ డ్‌, 2006లో కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ కార్యదర్శి మారెప్ప, 2008లో కుందుర్పి ఎస్‌ఐ వేమనారాయణ, 2012లో కుందుర్పి మండలం అపిలేపల్లి వీఆర్‌ఓ మల్లికార్జునగౌడ్‌, 2013లో బ్రహ్మసముద్రం మండలం వెస్ట్‌కోడిపల్లి వీఆర్‌ఓ మధు, 2015లో కళ్యాణదుర్గం మండలం మానిరేవు వీఆర్‌ఓ నాగిరెడ్డి, 2016లో కళ్యాణదుర్గం ఆర్‌ఐ వెంకటేశులు, ప్రస్తుతం కళ్యాణదుర్గం మండల సర్వేయర్‌ హేమసుందర్‌ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ వలలో చిక్కుకున్నారు.పలువురు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై నియో జకవర్గ ప్రజలు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2001 నుంచి వరుసగా 2008 వరకు ఏడాదికో అధికారి ఏసీబీ వలలో పడి... ఆయా శాఖలకు మచ్చతెచ్చారన్న విమర్శను మూటగట్టుకున్నారు.


Updated Date - 2022-01-29T05:57:12+05:30 IST