హోరెత్తిన టీడీపీ నిరసనలు

ABN , First Publish Date - 2021-10-21T05:07:32+05:30 IST

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఇంటిపై వైసీపీ నాయకులు, కార్యకర్తల దాడికి నిరసనగా బుధవారం టీడీపీ నిరసనలు తెలియజేసింది.

హోరెత్తిన టీడీపీ నిరసనలు
బీసీ జనార్దనరెడ్డిని అరెస్టు చేసిన డీఎస్పీ యుగంధర్‌బాబు, సీఐ సుబ్బరాయుడు


మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఇంటిపై వైసీపీ నాయకులు, కార్యకర్తల దాడికి నిరసనగా  బుధవారం టీడీపీ నిరసనలు తెలియజేసింది. ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయినా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయ కులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి, వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. 


బనగానపల్ల్లె, అక్టోబరు 20:   తెలుగుదేశం పార్టీ   కార్యాలయాలపై దా డులకు వ్యతిరేకంగా ఆ పార్టీ బుధవారం చేపట్టిన ధర్నా నేపథ్యంలో  మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డిని  అరెస్టు చేశారు. ఉదయం 6గంటలకు సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ కృష్ణమూర్తి హౌస్‌ అరెస్టు చేశారు. పోలీసులు బీసీ ఇంటి ఆవరణలో బందోబస్తును ఏర్పాటు చేశారు.  దీంతో వివిధ గ్రామాలనుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు  బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు బీసీ తదితర నాయకు లు, కార్యకర్తలు  టీడీపీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా   పోలీసులు బీసీ జనార్దనరెడ్డిని అడ్డుకున్నారు. బీసీతో పాటు, జిల్లా టీడీపీ మైనార్టీశాఖ  అధ్యక్షుడు జాహిద్‌హుస్సేన, తదితర  టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను తోసుకుంటూ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీసీని అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కించడానికి సీఐ ఆధ్వర్యంలో పోలీసులు విఫలయత్నం చేశారు.  టీడీపీ నాయకులు నాయకులు, కార్యకర్తలు బీసీని అరెస్టు చేయయకుండా ప్రతిఘటించారు. దీంతో పోలీసులకు, టీడీపీ నాయకులకు తోపులాట జరిగింది. ఎట్టకేలకు బీసీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు  పాతబస్టాండ్‌ సమీపంలోని రాఘవేంద్ర షాపింగ్‌ కాంప్లెక్స్‌కు చేరుకొని రోడ్డుపై బైఠాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డీఎస్పీ యుగంధర్‌బాబు, సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ కృష్ణమూర్తి  ఆధ్వర్యంలో బీసీని అరెస్టు చేసి స్థానిక సర్కిల్‌ స్టేషనకు తీసుకువచ్చారు. అనంతరం సొంతపూచీ కత్తుపై బీసీని విడుదల చేశారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు టీడీపీ  కార్యాలయాలపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ  శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో పాతపాడు సర్పంచ మహేశ్వరరెడ్డి, కప్పెట నాగేశ్వరరెడ్డి, దొనపాటి భాస్కర్‌రెడ్డి, హర్షద్‌, గడ్డం చెన్నారెడ్డి, భూషన్న, గోపాల్‌రెడ్డి, సలాం, మౌళీశ్వరరెడ్డి, పుుల్లారెడ్డి, ఖాదర్‌,  జహంగీరు, బురానుద్దీన,  బాబయ్య, బాలనాయుడు, శంఖేశ్వరరెడ్డి, లాయర్‌ నాగేంద్రరెడ్డి, రంగస్వామి, ఉమామహేశ్వరరావు, భాస్కర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కలాం, తులసిరెడ్డి, ఖాసీంబాషా, దస్తగిరి, మహేశ్వరరెడ్డి,  బాలసుబ్బయ్య, రామిరెడ్డి,  మహ్మద్‌, అధిక సంఖ్యలో వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

పాములపాడు: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై, నాయకులపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసు లు అరెస్టు చేసి స్టేషనకు తరలించారని, ఇది  హేయమైన చర్య అని టీడీపీ మండల  అధ్యక్షుడు   చెల్లె హరినాథరెడ్డి నాయకులు గోవిందు, శంకర్‌స్వామి, చంద్రశేఖర్‌, రామక్రిష్ణ అన్నారు.  రోజు రోజుకూ వైసీపీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోయిందని అన్నారు.  

నందికొట్కూరు: రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అరాచకపాలన సాగిస్తున్నారని మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ గుండం రమణారెడ్డి అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై, అధికార ప్రతినిధి  ఇంటిపై   దాడికి నిరసనగా బుధ వారం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.   దుకాణాలను మూసి వేయించి బంద్‌ నిర్వహించారు.  పటేల్‌ సెంటర్‌ కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. నియోజకవర్గంలో పలువురు టీడీపీ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామంలో మాజీ ఎంపీపీ ప్రసాదరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.   కార్యక్రమంలో టీడీపీ నాయకులు  మహేశ్వరరెడ్డి, ఓబుల్‌రెడ్డి, గిరీశ్వర్‌రెడ్డి, జాకీర్‌హుసేన్‌, శ్రీనివాసులు, మద్దిలేటి, మోహన్‌, జయసూర్య, వేణు, ముత్తు పాల్గొన్నారు.






Updated Date - 2021-10-21T05:07:32+05:30 IST