ఇంట్లో బోర్‌ కొడుతోందా?

ABN , First Publish Date - 2022-04-04T06:25:06+05:30 IST

ఆఫీసుకు వెళితే సమయం తెలియదు. షాపింగ్‌కు వెళితే టైం ఇట్టే గడిచిపోతుంది. కానీ ఇంట్లోనే ఉంటే ఎవరికైనా బోర్‌ కొడుతుంది. అలాంటప్పుడు ఇదిగో ఇలా చేయండి.

ఇంట్లో బోర్‌ కొడుతోందా?

ఆఫీసుకు వెళితే సమయం తెలియదు. షాపింగ్‌కు వెళితే టైం ఇట్టే గడిచిపోతుంది. కానీ ఇంట్లోనే ఉంటే ఎవరికైనా బోర్‌ కొడుతుంది. అలాంటప్పుడు ఇదిగో ఇలా చేయండి. 

కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్‌ చేయండి. తిరుమల దైవక్షేత్ర దర్శనానికి వెళ్లాలని అనుకుంటే టికెట్‌ బుకింగ్‌, గదుల బుకింగ్‌ వంటివి ప్లాన్‌ చేసుకోండి. విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ట్రావెల్‌ టికెట్స్‌, హోటల్‌ గదుల లభ్యతకు సంబంధించిన వివరాలను నెట్‌లో వెతికి ప్రణాళిక సిద్ధం చేయండి.

మీకు నచ్చిన పుస్తకం తీసి కాసేపు చదవండి. పుస్తకాలు చదివేందుకు సమయం దొరకడం చాలా అరుదు. కాబట్టి దొరికిన సమయాన్ని వినియోగించుకోండి.

స్నేహితులకు వీడియో కాల్‌ చేసి మాట్లాడండి. క్షేమసమాచారాలు అడిగి తెలుసుకోండి. చాలాకాలంగా మాట్లాడలేకపోయిన మిత్రులను పలకరిస్తే ఇంకా మంచిది.

మీకు ఏదో ఒక హాబీ ఉండే ఉంటుంది. బిజీ లైఫ్‌ వల్ల దాన్ని పక్కన పడేసి ఉంటారు. ఇప్పుడు సమయం దొరికింది కదా! ఆ హాబీని బయటకు  తీయండి. గిటారు వాయించడం మీ హాబీ అయితే దాని దుమ్ము దులపండి.

ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్‌సీరి్‌సలు వచ్చి ఉంటాయి. వాటిని చూసేయండి. ప్రస్తుతం బోలెడు వెబ్‌సీరి్‌సలు అందుబాటులో ఉన్నాయి. 

మీ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ఇది మంచి సమయం. ఫేస్‌ప్యాక్‌లు, బ్లీచ్‌లు, హెయిర్‌కేర్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌... ఇలా అన్నీ ఇంట్లోనే కానిచ్చేయండి.

ఫోన్‌లో చాలా ఫోటోలు పేరుకుపోయి ఉంటాయి. వాట్సా్‌పలో వచ్చే ఫోటోలతో స్టోరేజీ నిండిపోయి ఉంటుంది. వాటిని తొలగించుకోవడానికి ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోండి. ఏమైనా ముఖ్యమైన ఫొటోలు ప్రింట్‌ వేయించుకోవాలనుకుంటే వాటిని సెలక్ట్‌ చేసి ఒక ఫోల్డర్‌లో వేసుకోండి. 

ఇంట్లో వార్డ్‌రోబ్‌ని నీట్‌గా సర్దండి. పాత దుస్తులను తొలగించాలనే పని ఎప్పుడూ వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడా పని చేసేయండి.

ఇంట్లో కొన్ని కూరగాయలు, ఆకుకూరల మొక్కలను పెంచండి. వారంలో ఒకరోజైనా ఇంటి కూరగాయలు తింటే ఆ సంతోషమే వేరు. 

వ్యాయామానికి కొంత సమయం కేటాయించండి. ఒకటి రెండు గంటలు ఎక్కువ సమయం 

నిద్రపోండి.


Updated Date - 2022-04-04T06:25:06+05:30 IST