మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దు భద్రత కట్టుదిట్టం

ABN , First Publish Date - 2021-07-30T04:20:26+05:30 IST

మావోయిస్టుల వారోత్స వాల సందర్భంగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహ ద్దుల్లో భధ్రతను కట్టుదిట్టం చేసినట్లు ఓఎస్‌డీ శరత్‌చంద్రపవార్‌ అన్నారు. గురువారం రాపన్‌ పల్లి వద్ద ప్రాణహిత నదిపై ఉన్న అంతర్‌రాష్ట్ర వంతెనను సందర్శించి పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ఉండడంతో ఓఎస్‌డీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దు భద్రత కట్టుదిట్టం
అంతర్‌రాష్ట్ర వంతెన వద్ద ఓఎస్‌డీ, తదితరులు

కోటపల్లి, జూలై 29: మావోయిస్టుల వారోత్స వాల సందర్భంగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహ ద్దుల్లో భధ్రతను కట్టుదిట్టం చేసినట్లు ఓఎస్‌డీ శరత్‌చంద్రపవార్‌ అన్నారు. గురువారం  రాపన్‌ పల్లి వద్ద ప్రాణహిత నదిపై ఉన్న అంతర్‌రాష్ట్ర వంతెనను సందర్శించి పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ఉండడంతో ఓఎస్‌డీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఓఎస్‌డీ మాట్లాడు తూ తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం లేద ని,  వారోత్సవాల సందర్భంగా సరిహద్దుపై నిఘా పెంచామన్నారు. అడవుల్లో ప్రత్యేక పోలీసు బల గాలు గాలింపు చేపడుతున్నాయని, శాంతి భద్రత ల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు.  అర్జునగుట్ట గ్రామంలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు.  ప్రాణ హిత సరిహద్దున డ్రోన్‌ కెమెరా సహకారంతో పరిస్థితి సమీక్షించారు. ప్రజలు  సహకరిం చాలని, మావోయిస్టులు బెదిరిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు. డీసీపీ ఉదయ్‌కుమార్‌, ఏసీపీలు నరేందర్‌, అఖిల్‌ మహా జన్‌, సీఐలు నాగరాజు, ప్రవీణ్‌కుమార్‌,  ఎస్‌ఐ రవికుమార్‌లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-30T04:20:26+05:30 IST