ఎంత వరకు ప్రభుత్వం నుంచి తీసుకురావాలో అంత తీసుకువచ్చాం: బొప్పరాజు

ABN , First Publish Date - 2022-02-06T21:08:14+05:30 IST

భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా మంత్రుల కమిటీతో చర్చించుకోవాలని సీఎం జగన్ సూచించారని...

ఎంత వరకు ప్రభుత్వం నుంచి తీసుకురావాలో అంత తీసుకువచ్చాం: బొప్పరాజు

విజయవాడ: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా మంత్రుల కమిటీతో చర్చించుకోవాలని సీఎం జగన్ సూచించారని స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ సభ్యులు కలిశారు. అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ అన్ని సక్రమంగా నడిస్తే భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఏం చేస్తారో... చూస్తారని  సీఎం చెప్పినట్లు తెలిపారు. తమ వంతు ఎంత వరకు ప్రభుత్వం నుంచి తీసుకురావాలో అంత తీసుకువచ్చామన్నారు. 


శనివారం రాత్రి చర్చల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 1330 కోట్లు అదనపు భారం పడిందని బొప్పరాజు అన్నారు. రికవరీ లేకుండా చేయడం వల్ల అదనంగా రూ. 5,400 కోట్లు  ప్రభుత్వంపై పడిందన్నారు. ఉద్యోగులంతా  ఐక్యతను చూపించడం ఇదే మొదటిసారి అని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కారిస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. సీపీఎస్ రద్దు అంశంపై  చర్చించి పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ సహృదయంతో అర్థంచేసుకోవాలన్నారు. ఉద్యోగ సంఘాల నేతలుగా తమ కర్తవ్యాలను నిజాయితీగా నెరవేర్చామన్నారు. ఇదే సహకారాన్ని భవిష్యత్తులోనూ ఉద్యోగులు కొనసాగించాలని కోరుతున్నామని బొప్పరాజు అన్నారు.

Updated Date - 2022-02-06T21:08:14+05:30 IST