విజృంభిస్తోన్న కరోనా

ABN , First Publish Date - 2020-08-08T06:04:25+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం జిల్లాలో ఏకంగా 88 పాజిటివ్‌ కేసు లు నమోదయ్యాయి.

విజృంభిస్తోన్న కరోనా

జిల్లాలో ఒకేరోజు 88 పాజిటివ్‌

ఇద్దరి మృతి


మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 7: కరో నా వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం జిల్లాలో ఏకంగా 88 పాజిటివ్‌ కేసు లు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితోపాటు వివిధ మండలాల పీహెచ్‌ సీల్లో మొత్తం 327 మందికి పరీక్షలు నిర్వహించగా 88 పాజిటివ్‌గా నిర్ధార ణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధి కారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో 21 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, చెన్నూర్‌లో 5, లక్షెట్టిపేటలో 4, నస్పూర్‌లో 19, మందమర్రిలో 19, బెల్లంపల్లిలో 8, తాండూర్‌లో 4, నెన్నెలలో 2, వేమనపల్లి 3, జన్నారంలో 3 కేసులు నమోదయ్యా యి. అలాగే నస్పూర్‌, బెల్లంపల్లిలో కరోనాతో ఒక్కొక్క రు మృతి చెందారు. వీటితో ఇప్పటివరకు 636 యాక్టివ్‌ కేసులుండగా 13 మంది మరణించారని వైద్యాధికారు లు తెలిపారు.  


నస్పూర్‌ : నస్పూర్‌ పీహెచ్‌సీలో శుక్రవారం 50 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా 19 మం దికి వైరస్‌ సోకినట్లు తేలింది. హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఒకే ఇంట్లో నలుగురు, నస్పూర్‌కాలనీ, శ్రీరాం పూర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, సీతారాంపల్లి, నస్పూర్‌  ఏరియాల కు చెందిన వారితోపాటు కాగజ్‌నగర్‌కు చెందిన ఇద్దరు కరోనా బారినపడ్డారు.

 

చెన్నూర్‌: చెన్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 15 మం దికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యులు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆద ర్శనగర్‌లో ఒకరికి, పాత బస్టాండ్‌ ప్రాంతంలో ఒకరికి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరికి, కోటబొగుడ, మారెమ్మవాడ ప్రాంతానికి చెందిన ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన పేర్కొన్నారు. 


మందమర్రిటౌన్‌ : పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల లో 44 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌ నమోదైంది. వారితోపాటు కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూ చించి మందులు అందజేశారు. ఇప్పటి వరకు పట్టణం లో 85 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


తాండూర్‌(బెల్లంపల్లి) : తాండూర్‌ పీహెచ్‌సీలో  12 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. మాదా రం టౌన్‌షిప్‌లో ఒకరికి, ఐబీ కేంద్రంలో ముగ్గురికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఎంపీటీసీతోపాటు అతని భార్య, తల్లికి పాజిటివ్‌ వచ్చింది. 


వేమనపల్లి:  వేమనపల్లి పీహెచ్‌సీలో ఏడుగురికి పరీక్షలు చేయగా ముగ్గురుకు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి కృష్ణ తెలిపారు. వీరు మంచిర్యాలలోని చున్నంబట్టి వాడలో నివాసం ఉంటారని పేర్కొన్నారు.  


దండేపల్లి : లక్షెట్టిపేట సివిల్‌ ఆసుప్రతిలో నిర్వ హించిన కరోనా పరీక్షలో కన్నెపల్లికి చెందిన 20 ఏళ్లు వ్యక్తికి పాజిటివ్‌ నమోదైనట్లు ప్రభుత్వ వైద్యాధి కారి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు.


బెల్లంపల్లి టౌన్‌ : బెల్లంపల్లి  ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా 8 పాజిటివ్‌గా వచ్చా యి.  బెల్లంపల్లి పట్టణానికి చెందిన 6 కాగా ఆకెనపల్లి కి చెందిన ఒకరు,  కాసిపేట మండలం ముత్యంపల్లికి చెందిన ఒకరని వైద్యులు తెలిపారు. పట్టణంలోని రడ గంబాల బస్తీలో రెండు, టేకుల బస్తీ ఒక్కటి, మహ్మద్‌ కాసీం బస్తీ ఒకటి, కాల్‌టెక్స్‌ ఒకటి, నంబర్‌ 2 ఇంక్లైన్‌ బస్తీకి చెందినవి రెండు కేసులున్నాయి. బెల్లంపల్లిలో దాదాపు 92కు పైగా కేసులు నమోదయ్యాయి.


నెన్నెల: నెన్నెల పీహెచ్‌సీలో ఆరుగురికి కరోనా పరీ క్షలు నిర్వహించగా ఇద్దరికి వైరస్‌ సోకినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అనీష్‌ తెలిపారు. డాక్టర్‌తోపాటు మం దమర్రికి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. వైద్యుడు వారం రోజులుగా విధులకు రావడం లేదు. శుక్రవారం డ్యూటీలో జాయిన్‌ కాకుండా టెస్టు చేసుకోవడంతో నిర్ధారణ అయ్యింది.  


జన్నారం : జన్నారం మండలంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌  నిర్ధారణ అయ్యింది. పొన్కల్‌ లో ఇద్దరికి, ధర్మారంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ తేలింది.


లక్షెట్టిపేట : లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రిలో 27 మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చిన ట్లు ప్రభుత్వ వైద్యాధికారి కుమారస్వామి తెలిపారు.


నస్పూర్‌లో మహిళ మృతి

నస్పూర్‌: జిల్లా కేంద్రంలో పని చేస్తున్న కాని స్టేబుల్‌తోపాటు అతని భార్య కరోనా బారిన పడ్డా రు. ఇద్దరు నస్పూర్‌లోని ఫ్లడ్‌ కాలనీలో హోం ఐసోలేషన్‌లో వైద్యం పొందుతున్నారు. అతని భార్య (36) న్యూమోనియా ఉండడంతో గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు రాత్రి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.


ఈ విషయాన్ని వైద్యు లకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదే హాన్ని ఇంటికి తీసుకువెళ్ళకుండ నేరుగా ఆర్‌కే-8 శ్మ శాన వాటికకు తీసుకువెళ్ళి అర్ధరాత్రే అంత్యక్రియలు నిర్వహించారు. సీసీసీ ఎస్సై ప్రమోద్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకిషన్‌ పర్యవేక్షణలో కొవిడ్‌ నిబం ధనల ప్రకారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం చుట్టు పక్కల వారికి ఆమె మృతి చెందడం, అంత్యక్రియలు పూర్తయిన విషయం తెలిసి నిర్ఘాతపోయారు. కరోనా మరణంతో బంధువులు, చుట్టుపక్కల వారు కనీసం చివరి చూపునకు కూడా నోచుకోలేక పోతున్నారు.


బెల్లంపల్లిలో  వృద్ధుడి మృతి

బెల్లంపల్లి టౌన్‌: కరోనా వైరస్‌ మహమ్మారికి  పట్టణంలోని హనుమాన్‌ బస్తీకి చెందిన ఓ వృద్ధుడు (66) హైదరాబాద్‌ కింగ్‌ కోటి ఆసుపత్రిలో శుక్రవా రం ఉదయం మృతి చెందాడు. ఈనెల 2న బెల్లం పల్లి ఐసోలేషన్‌కు రాగా వైద్యులు మంచిర్యాల ప్రైవే టు ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు హైదరాబాద్‌ కింగ్‌కోటి ఆసుపత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు పేర్కొన్నారు.  బెల్లంపల్లిలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. 

Updated Date - 2020-08-08T06:04:25+05:30 IST