మళ్లీ విజృంభిస్తోంది

ABN , First Publish Date - 2022-01-18T05:56:24+05:30 IST

కరోనా వైరస్‌ మరోసారి దాడి ప్రారంభించింది. కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే వారంరోజులుగా ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నెల రోజుల క్రితం వరకు రోజువారీగా ఒకటి, రెండు కేసులు నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ... పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ మరోసారి దాడి ప్రారంభించింది. కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే వారంరోజులుగా ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

మళ్లీ విజృంభిస్తోంది
కరోనా నిర్ధారణ పరీక్షల కోసం భువనగిరిలో క్యూలో నిలబడ్డ ప్రజలు

రెట్టింపు స్థాయిలో పాజిటివ్‌ కేసుల నమోదు 

అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన

గుట్ట పోలీ్‌సస్టేషన్‌లో 12మందికి పాజిటివ్‌

ఆత్మకూరు(ఎం)లో మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు

మర్రిగూడ సీఐకు సైతం..

వలిగొండ ఎంపీడీవోకు పాజిటివ్‌


(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): కరోనా వైరస్‌ మరోసారి దాడి ప్రారంభించింది. కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే వారంరోజులుగా ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నెల రోజుల క్రితం వరకు రోజువారీగా ఒకటి, రెండు కేసులు నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ... పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.



ఉమ్మడి జిల్లా హైదరాబాద్‌ నగరానికి చేరువలో ఉండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తరుచూ రాకపోకలు సాగిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది నగరం నుంచి పల్లెలకు చేరుకున్నారు. ఆర్టీసీతోపాటు ప్రైవేట్‌ వాహనాల్లో పరిమితికి మించి కూర్చుంటూ భౌతికదూరాన్ని పాటించకపోవడంతో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇటీవల యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడి హోంక్వారంటైన్‌లో చికిత్స పొందారు. ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా పరిశీలిస్తే ఈ నెల 10వ తేదీన మొత్తం 65 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 11న 118, 12న 93,13న 99, 14న 93, 16న 55 కేసులు నిర్ధారణ కాగా, 17వ తేదీ ఒక్కరోజే 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 188, నల్లగొండ జిల్లాలో 125, సూర్యాపేట జిల్లా లో 18 కేసులు నిర్ధారణ అయ్యాయి. మున్ముందు కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.


గుట్ట పోలీ్‌సస్టేషన్‌లో 12మంది సిబ్బందికి పాజిటివ్‌

యాదగిరిగుట్ట పోలీసుస్టేషన్‌లో కరోనా కేసుల కలకలం సృష్టిస్తోం ది. ఏసీసీతోపాటు సీఐ, మరో 10 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరి కుటుంబసభ్యుల్లోనూ పలువురు కరోనాబారిన పడినట్టు సమాచారం. కాగా, వీరంతా ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆత్మకూరు(ఎం) పోలీ్‌సస్టేషన్‌లో మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పోలీ్‌సస్టేషన్‌ను సోమవారం శానిటైజ్‌ చేశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ సీఐకి సైతం పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. ఆత్మకూరు(ఎం) పీహెచ్‌సీలో 67 మందికి రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వలిగొండ ఎంపీడీవో గీతారెడ్డికి సైతం కరోనా పాజిటివ్‌ వచ్చింది. సోమవారం వర్కట్‌పల్లి పీహెచ్‌సీవో ఆమె వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా వైద్య సిబ్బంది నిర్ధారించారు. అదేవిధంగా మరో 127 మందికి రాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 22 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. యాదగిరిగుట్ట పీహెచ్‌సీలో సోమవారం 58మందికి పరీక్షలు నిర్వహించగా, 16మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు.


హుజూర్‌నగర్‌ కోర్టులో ప్రత్యక్ష విచారణ నిలిపివేత 

హుజూర్‌నగర్‌ : పట్టణంలోని కోర్టులో ప్రత్యక్ష విచారణలు నిలిపివేస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి నరసింహమూర్తి తెలిపారు.కోర్టు హాల్‌ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 4 వరకు ప్రత్యక్ష విచారణలు ఉండవని, కక్షిదారులు కోర్టుకు హాజరుకావద్దన్నారు.


ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు ఇలా..

జిల్లా-తేదీ: 10న 11న 12న 13న 14న 16న 17న

నల్లగొండ 24 31 28 28 21 26 125

సూర్యాపేట 2 5 22 42 30 25 18

యాదాద్రి 39 82 43 29 42 4 188

మొత్తం 65 118 93 99 93 55 331

Updated Date - 2022-01-18T05:56:24+05:30 IST