ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-08T09:50:50+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ఈనెల 14వ తేదీ తరువాత

ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్‌ ప్రారంభం

తెరుచుకున్న ఆర్టీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌...

ఏసీ బస్సులకు తాత్కాలికంగా రిజర్వేషన్‌ రద్దు


అనంతపురం టౌన్‌, ఏప్రిల్‌ 7: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ఈనెల 14వ తేదీ తరువాత ఎత్తివేస్తారా..? లేక పొడిగిస్తారా..? అనే విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత లేక పోయినా బస్సు సర్వీసులు మాత్రం నడిపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ(ప్రజారవాణాశాఖ) యంత్రాం గం సిద్ధమవుతోంది. గతనెల 23 నుంచి నిలిచిపోయిన ఆన్‌లైన్‌ బు కింగ్‌ రిజర్వేషన్లు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. దీంతో ప్రజలు పెద్దఎత్తున ఆన్‌లైన్‌ద్వారా బస్సుల్లో సీట్లు బుక్‌ చేసుకుంటున్నారు.


ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు ఇప్పటికే సుమారు 45శాతానికి పైగా రిజర్వేషన్లు పూర్తయినట్లు ఆ శాఖ వర్గాల సమాచారం. జిల్లానుంచి అన్ని రూట్లకూ యధావిధిగా అధికారులు బస్సు సర్వీసులు నడపనున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అంతమయ్యేవరకూ ఏసీ బస్సు సర్వీసులు నడపరాదని భావించి జిల్లావ్యాప్తంగా గల 8 ఏసీ బస్సుల రిజర్వేషన్లు ప్రారంభిచలేదని ఆర్టీసీ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.


లాక్‌డౌన్‌ పొడిగిస్తే నగదు వెనక్కు పొందే అవకాశం : గోపాల్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం

గతనెల 23 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించినప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా బస్సులన్నింటినీ డిపోలకే పరిమితం చేశాం. బస్‌ స్టేషన్లలోని రిజర్వేషన్‌ కౌంటర్లు మూసివేయడంతోపాటు ఆన్‌లైన్‌ బుకింగ్‌లూ నిలిపివేశాం. ఈనెల 14 తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారనే ఉద్దేశంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ బుకింగ్‌లు ప్రారంభించాం. 14 తరువాత ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగిస్తే ప్రయాణికులు రిజర్వేషన్‌కోసం ఆన్‌లైన్‌లో చెల్లించిన నగదు తిరిగి వారికి చెల్లించి, టికెట్లు రద్దు చేస్తాం.

Updated Date - 2020-04-08T09:50:50+05:30 IST