Abn logo
Nov 26 2021 @ 00:00AM

వేదావలోకనం

వేదాలు ఒకనాటి మానవ జీవన విధానానికి ప్రతీకలు. మన భారతదేశ సంస్కృతి వికాస చరిత్రలో వేదాలు ముఖ్యమైన భూమిక వహిస్తాయి. వేదాల శాస్త్రీయతపై అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నా- వీటికి మన సమాజంలో ఉన్న స్థానం తిరుగులేనిది. వేదాల పుట్టుక, వాటిని మనం ఏ కోణం నుంచి చూడాలి? 


సమకాలీన సమాజంలో వేదాలలోని అంశాలకు ఉన్న ప్రాముఖ్యత, ఇవి కేవలం హిందూ మత ప్రస్థానానికి ప్రతీకలా.. మొదలైన విషయాలను విశ్లేషణాత్మకంగా చర్చించిన పుస్తకం- ‘వేదావలోకనం’. బుర్రా గోవర్థన్‌ రచించిన ఈ పుస్తకంలో వేదాల ప్రస్థానం మనకు సాదోహరణంగా కనిపిస్తుంది. నాలుగు వేదాలలో అత్యంత పురాతనమైనది రుగ్వేదం. అన్నింటి కన్నా చివరగా చెప్పబడింది అధర్వణవేదం. ఈ రెండింటి మధ్య ఉన్న కాలంలో భారత ఉపఖండంలో జరిగిన అనేక మార్పులను ఈ నాలుగు వేదాలలోను గమనించవచ్చు. ఈ మార్పులన్నింటికీ సంబంధించిన సవివరమైన విశ్లేషణ ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. హిందూ మత మూలాలపై ఆసక్తి ఉన్నవారందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది. 


వేదావలోకనం

రచన: బొర్రా గోవర్ధన్‌

ప్రచురణ: డీబీఎంకే

ప్రతులకు: 9390600157