సాహితీ పరిమళాలు పంచిన కడిమెళ్ల

ABN , First Publish Date - 2022-08-15T05:18:03+05:30 IST

ఎందరో శిష్యులను తయారుచేసి సాహితీ పరిమళాలు పంచిన ఘనత కడిమెళ్లకే దక్కుతుందని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ అన్నారు.

సాహితీ పరిమళాలు పంచిన కడిమెళ్ల
పుస్తకావిష్కరణలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌

నరసాపురం, ఆగస్టు 14: ఎందరో శిష్యులను తయారుచేసి సాహితీ పరిమళాలు పంచిన ఘనత కడిమెళ్లకే దక్కుతుందని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ అన్నారు. కడిమెళ్ల రచించిన తప్పుకాదు, ఆయన కుమారుడు విరుచి రచించిన పట్నాల బతుకులు పుస్తకావిష్కరణ అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ సాహిత్యంలో మేరునగధీరులు డాక్టర్‌ కడిమెళ్ళ అన్నారు. ఆయన శిష్యుల్లో తాను ఒక్కడిని కావడం గర్వంగా ఉందన్నారు. మరో అతిధి, ప్రముఖ సాహితీ రచయిత డాక్టర్‌ అపర్ణ మాట్లాడుతూ తండ్రీ కొడుకులు రచించన రెండు విభిన్న పుస్తుకాలను ఒకే వేదికపై ఆవిష్కరిం చడం అరుదైన సంఘటనగా అభివర్ణించారు. నేటి యాంత్రిక యుగంలో  పట్నాల బతుకులు ఎలా ఉంటాయో, ఎటువంటి దుర్భర స్థితిలో బతుకుతున్నారో అనే అంశాన్ని కవి లోతుగా పరిశీలించి రాయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో చేగొండి సత్యనారాయణ మూర్తి, రెడ్డప్ప ధవేజీ, బాబుశ్రీ, మట్టా సుగుణరావు, రంగినీడి సుబ్బారావు, షేక్‌ శిలార్‌, సాహిబ్‌, సుధీర్‌ మోహన్‌, తదితరులు పాలొన్నారు.

Updated Date - 2022-08-15T05:18:03+05:30 IST