Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో పుస్తకావిష్కరణ

బాపట్ల: బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ అడ్వాన్డ్‌ కంప్యూటర్‌ టెక్నిక్స్‌ కాన్ఫరెన్స్‌ ప్రొసీడింగ్స్‌ పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.దామోదరనాయుడు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల కోసం మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. విభాగాధిపతి డాక్టర్‌ షేక్‌ నజీర్‌ మాట్లాడుతూ కాన్ఫరెన్స్‌ ప్రచురణకు 90పత్రాలను సమర్పించగా అందులో 53పత్రాలను చర్చకు అనుమతించినట్లు తెలిపారు. రెండు రోజుల ఆన్‌లైన్‌ సదస్సులో ఏడు విభాగాలలో 53 పత్రాలను చర్చించినట్లు తెలిపారు. ఈ సదస్సులో ఐదు దేశాలనుంచి శాస్త్రవేత్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో మానవ మనుగడ సాధ్యమవటానికి సాంకేతిక ఎంతగానో దోహదపడుతుందని అందుకే ఆధునిక సాంకేతిక విధానాలు అనే అంశంపై సదస్సు నిర్వహించినట్లు సీనియర్‌ ఆచార్యులు డాక్టర్‌ నాగళ్ళ సుధాకర్‌ అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు డాక్టర్‌ ఎస్‌.రామకృష్ణ, కె.మణిదీప్‌, అధ్యాపకులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement