సామాజిక స్పృహ రచనలకు ఆదరణ

ABN , First Publish Date - 2022-06-27T06:46:51+05:30 IST

సామాజిక స్పృహ ఉండే రచనలకు ఆదరణ ఉం టుందని సుప్రసిద్ధ సాహితీవేత్త విహా రి అన్నారు.

సామాజిక స్పృహ రచనలకు ఆదరణ
పూర్ణచంద్రోదయం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న విహారీ తదితరులు

మచిలీపట్నం టౌన్‌   : సామాజిక స్పృహ ఉండే రచనలకు ఆదరణ ఉం టుందని సుప్రసిద్ధ సాహితీవేత్త విహా రి అన్నారు. చిలకలపూ డి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో జి.వి.పూర్ణచంద్‌ రచించిన పూర్ణచంద్రోదయం పుస్తకాన్ని విహారీరి ఆవిష్కరించి ప్రసంగించారు. జి.వి. పూర్ణచంద్‌ రచనలో వైవిధ్యం ఉంటుందన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు జి.వి.పూర్ణచంద్‌ చేసిన కృషి మరువలేమన్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం విశ్రాంత సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ అధ్యక్షత వహించిన ఈ గ్రంథావిష్కరణ సభలో సాహితీవేత్త డాక్టర్‌ గుమ్మా సుబ్బారావు గ్రంథాన్ని విశ్లేషించారు. ఆచార్య వి.నిత్యానందరావు, అన్నపూర్ణ వృద్ధా శ్రమ నిర్వాహకురాలు కరెడ్ల సుశీల, రచయిత భవిష్య తదితరులు మాట్లాడారు. పూర్ణచంద్‌ను ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2022-06-27T06:46:51+05:30 IST