Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 18 Jan 2022 18:47:18 IST

Sridevi వీపుపై Boney Kapoor పేరు... అతిలోక సుందరి ఫోటో వెనుక కథేంటంటే...

twitter-iconwatsapp-iconfb-icon
Sridevi వీపుపై Boney Kapoor పేరు... అతిలోక సుందరి ఫోటో వెనుక కథేంటంటే...

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ దివంగత శ్రీదేవి ఫోటో ఒకటి నెటిజన్స్‌తో షేర్ చేసుకున్నారు. అయితే, అందులో ఆమె వీపుపై ‘బోనీ’ అన్న ఇంగ్లీష్ అక్షరాలు సింధూరంతో రాసి ఉండటం... చాలా మందిని ఆశ్చర్యపరిచింది. భార్య వెన్నుపై తన పేరు ఉన్న ఫోటని షేర్ చేసిన బోనీ కపూర్, అది ఎప్పటిదో కూడా తెలియజేశారు. ‘‘2012లో లక్నోలోని సహారా సహర్ ప్రాంతంలో జరిగిన దుర్గా పూజ సంబరాల సందర్భంగా...’’ అంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు. 


చీరకట్టులో అతిలోక సుందరి శ్రీదేవి... పైగా ఆమె వెనుక భాగంలో ఎర్రటి అక్షరాలతో ‘బోనీ’ అన్న పేరు... పిక్ చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవ్వకుండా ఉంటారా చెప్పండి? ‘‘రూప్ కీ రాణీ’’ అంటూ ఒకరు కీర్తించగా... ‘‘ఆమె మన మధ్య లేరనే సత్యం ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నాను’’ అంటూ మరోకరు బాధపడ్డారు. ‘‘ఇంతకీ మీ పేరు అక్కడ ఎవరు రాశారు సర్? కేవలం ఉత్సుకతకొద్దీ అడుగుతున్నానంతే...’’ అంటూ ఒకరిద్దరు కామెంట్స్ సెక్షన్‌లో మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేశారు! 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...