Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 29 Sep 2021 19:43:24 IST

అజిత్ తో మరో చిత్రాన్ని నిర్మించనున్న బాలీవుడ్ అగ్ర నిర్మాత

twitter-iconwatsapp-iconfb-icon
అజిత్ తో మరో చిత్రాన్ని నిర్మించనున్న బాలీవుడ్ అగ్ర నిర్మాత

చెన్నై: హైదరాబాద్‌లో పుట్టిన తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ సూపర్‌స్టార్ గా ఎదిగినవారు అజిత్ కుమార్.  ప్రచారాలకు దూరంగా ఉంటూ హంగులు, అర్భాటాల జోలికి పోకుండా నిరాడంబరతను ప్రదర్శిస్తూంటాయన. బిల్లా, బిల్లా-2, వివేకం, విశ్వాసం, నెర్కొండ పారవై తదితర చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఆయన నటించిన చిత్రాలు టాలీవుడ్‌లోకి డబ్, రీమేక్ అవ్వాడమో జరుగుతూ ఉంటాయి. ఒకసారి అజిత్‌తో  చిత్రాన్ని నిర్మిస్తే  మరలా ఆయనతో తప్పకుండా చేయాలనుకుంటారు. నిర్మాతల శ్రేయస్సు కోరే నటుడాయన. టాలీవుడ్ బడా నిర్మాత ఏఏమ్. రత్నం అజిత్‌తో పలు సినిమాలను నిర్మించారు. తాజాగా ఈ జాబితాలో మరో నిర్మాత చేరనున్నారు. 


అజిత్‌తో బోనీ కపూర్ ఇప్పటికే రెండు చిత్రాలను నిర్మించారు. తాజాగా మరో చిత్రాన్ని  అజిత్‌తో నిర్మించనున్నట్టు ఆయన వెల్లడించారు. నెర్కొండ పారవై సినిమాను గతంలోనే నిర్మించగా ప్రస్తుతం వాలిమై సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాలకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలోనే అజిత్‌తో మరో సినిమాను నిర్మించనున్నట్టు తెలిపారు. వాలిమైలో సీబీసీఐడీ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సినిమాలో తెలుగు యువ నటుడు కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement