బోన్‌ సూప్‌ లాభాలు

ABN , First Publish Date - 2021-12-07T05:30:00+05:30 IST

తీవ్రమైన వ్యాధులు, సర్జరీల నుంచి కోలుకునే సమయంలో బోన్‌ సూప్‌ తాగాలని అంటూ ఉంటారు. ఈ సూప్‌లో వెలకట్టలేని పోషకాలు ఉండడమే అందుకు కార ణం. అవి ఆరోగ్యానికి...

బోన్‌ సూప్‌ లాభాలు

తీవ్రమైన వ్యాధులు, సర్జరీల నుంచి కోలుకునే సమయంలో బోన్‌ సూప్‌ తాగాలని అంటూ ఉంటారు. ఈ సూప్‌లో వెలకట్టలేని పోషకాలు ఉండడమే అందుకు కార ణం. అవి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుందాం!


జెలటిన్‌/కొల్లాజెన్‌: ఎముకల సూప్‌తో మృదు కణజాలం తయారై గాయాలు తేలికగా మానతాయి. మృదులాస్థి, ఎముకల మరమ్మతుకు తోడ్పడుతుంది. మ్యూకస్‌ మెంబ్రేన్‌, పేగుల్లోని లోపలి పొర తయారీకి సహాయపడుతుంది.


మృదులాస్థి: ఆర్థ్రయిటిస్‌, డిజనరేటివ్‌ జాయింట్‌ డిసీజ్‌, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌లకూ, తగ్గిన వ్యాధినిరోధకశక్తి పెరుగుదలకూ తోడ్పడుతుంది.


ఎముక మజ్జ: దీంతో పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, ,వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Updated Date - 2021-12-07T05:30:00+05:30 IST