హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించే వరకు ఉద్యమం

ABN , First Publish Date - 2022-09-25T06:08:27+05:30 IST

హెల్త్‌ వ ర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించే వరకు ఉద్యమం చేస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు, మాజీ ఎ మ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశా రు.

హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించే వరకు ఉద్యమం
సంఘీభావం తెలుపుతున్న బోండా ఉమా, పార్టీ నేతలు, కార్యకర్తలు

విద్యాధరపురం, సెప్టెంబరు 24 : హెల్త్‌ వ ర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించే వరకు ఉద్యమం చేస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు, మాజీ ఎ మ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశా రు. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ శనివారం ధర్నాచౌక్‌లో దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును జగ న్‌ రెడ్డి ఎందుకు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలుగు జాతికి ఇంతటి అన్యాయం జరుగుతుం టే వైసీపీ నేతలు సమర్థించుకోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఒక్క మెడికల్‌ కాలేజీగానీ, ఎ లిమెంటరీ స్కూల్‌గానీ కట్టని జగన్‌ ప్రభుత్వానికి పేరు మార్చే హక్కులేదన్నారు. 36ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్‌ పే రు పెట్టడం అనాలోచిత నిర్ణయమన్నారు. వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగిస్తూ, కొట్టేసిన రూ.400 కో ట్లు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. లేదం టే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు అ ధ్యక్షత వహించగా గొట్టిముక్కల రఘు, డీ నాగరా జు, రఫీ, సందేటి చంద్రభానుసింగ్‌, పలువురు నేతలు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

జగన్‌కు కూడా అదే గతి : సాదరబోయిన

అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ ఏమైపోయిందో ఇప్పుడు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటున్న జగన్‌రెడ్డికు కూడా అదే గతి పడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు విమర్శించారు. శనివారం వన్‌టౌన్‌లోని బు ద్దా వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 16 నెల లు జైలులో ఉండొచ్చిన జగన్‌ను 420 జగన్‌ అని, జైలు రెడ్డి అని పేరు మార్చాలా అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు మళ్లీ ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరిస్తామన్నారు. కుప్పంలో ప్రజలను నిర్బంధించి జగన్‌ సభ నిర్వహించాడన్నారు. అమరావతి రైతు ల మహా పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారన్నారు. గుడివాడలో ఎగరేసి నరుకుతామంటూ ఫ్లెక్సీలు వేయడం సిగ్గు చేటన్నారు. రాజగిరి అశోక్‌, కొండాబత్తుల కోటి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T06:08:27+05:30 IST