మహిళల వేధింపుల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: బోండా ఉమా

ABN , First Publish Date - 2022-04-26T01:59:36+05:30 IST

వాసిరెడ్డి పద్మ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ అయ్యాకే ఆంధ్రప్రదేశ్ మహిళలపై అఘాయిత్యాల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు.

మహిళల వేధింపుల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: బోండా ఉమా

అమరావతి: వాసిరెడ్డి పద్మ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ అయ్యాకే ఆంధ్రప్రదేశ్ మహిళలపై అఘాయిత్యాల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాసిరెడ్డి పద్మ పనితీరుపై తాము విమర్శలు చేయడం కాదు, ఎన్సీఆర్బీ నివేదికే చెప్తోందన్నారు. చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని నెంబర్ 1స్థానంలో ఉంచితే, జగన్‌రెడ్డి మహిళల వేధింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వైఫల్యాలను వాసిరెడ్డి పద్మ రోడ్డు మీదకి లాగిందని చెప్పారు.ఎక్కడికక్కడ మాదకద్రవ్యాల వాడకం పెరగటంతో పాటు ప్రభుత్వం తమనేం చేయదులే అనే ధీమా నేరస్థుల్లో నెలకొందన్నారు.వాసిరెడ్డి పద్మ ప్రవర్తన చూసి మహిళలే అస్యహించుకుంటున్నారన్నారు.మానసిక వికలాంగురాలిపై జరిగిన ఘటన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలోనే మరో రెండు ఘటనలు జరిగాయని తెలిపారు.మహిళా భద్రతకు తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకే 27న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టామని బోండా ఉమా పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-26T01:59:36+05:30 IST