అతి త్వరలో ఏపీ మరో శ్రీలంక: బోండా ఉమ

ABN , First Publish Date - 2022-04-05T17:18:29+05:30 IST

ఏపీ ఇప్పుడు బీహార్ లాగా ఉంది.. అతి త్వరలో ఏపీ మరో శ్రీలంక కాబోతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు.

అతి త్వరలో ఏపీ మరో శ్రీలంక: బోండా ఉమ

విజయవాడ: ఏపీ ఇప్పుడు బీహార్ లాగా ఉంది.. అతి త్వరలో ఏపీ మరో శ్రీలంక కాబోతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ శ్రీలంక అధ్యక్షుడు ఇంటిని ముట్టడించినట్లే .... సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇంటిని త్వరలో ప్రజలే ముట్టడిస్తారు.   సీఎం జగన్మోహన్‌రెడ్డి బాదుడే బాదుడు అనే కొత్త పథకాన్ని ప్రారంభించాడు. జిల్లాలు పెంచమని ఏ రాజకీయ పార్టీ అయిన జగన్‌ని ఆడిగిందా? వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాల పెంపు.కొత్త జిల్లాల్లో భూముల విలువ పెంచారంటే కొత్త పన్నులు వేయడానికి ప్రభుత్వం సిద్ధం అయినట్లు అర్థం. 6నెలల్లో 30 శాతం ఇంటి పన్ను పెంచిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమే.ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది.ఎందుకు భూముల విలువ పెంచారో ఒక కారణం ప్రభుత్వం చెప్పగలదా?.ఏపీని మూడేళ్లలో కుక్కలు చింపిన విస్తరి చేశారు.జగన్ బాదుడే బాదుడు అంశాన్ని గడపగడపకు తీసుకువెళ్తాం.జగన్ ఢిల్లీ పర్యటన సొంత ప్రయోజనాల కోసమే’’ అని బోండా ఉమ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-05T17:18:29+05:30 IST