విజయవాడ: ఎవరి ప్రయోజనాల కోసం కొత్తగా జిల్లాలు పెంచుతున్నారని టీడీపీ నేత బోండా ఉమమహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విభజనవల్ల ఎవరికైనా ప్రయోజనాలు చేకూరుతాయా?.. ఏ విధంగా ప్రయోజనాలు చేకూరుతాయో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అమ్మకు అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకి పట్టుచీర కొంటానన్నాడన్న చందంగా ఈ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడేళ్ల నుంచి ఒక్క అభివృద్ది పని కూడా జరగలేదని, ఇప్పుడు కొత్త జిల్లాలు చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనల్లో సమతుల్యత లేదని బోండా ఉమ విమర్శించారు.
ఇవి కూడా చదవండి