శాసనసభ ఆవరణలో బోనాలు

ABN , First Publish Date - 2022-07-22T22:39:38+05:30 IST

Hyderabad: అసెంబ్లీ ఆవరణలో బోనాల ఉత్సవాలు(Bonalu Festival) నిర్వహించారు. అసెంబ్లీ ఉద్యోగులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. మండలి చైర్మన్ గుత్తా

శాసనసభ ఆవరణలో బోనాలు

Hyderabad: అసెంబ్లీ ఆవరణలో బోనాల ఉత్సవాలు(Bonalu Festival) నిర్వహించారు. అసెంబ్లీ ఉద్యోగులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukendar Reddy) విప్ గొంగిడి సునీత (Sunita) తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. 


తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ప్రభుత్వం తరపున వివిధ ఆలయాలలో అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. జులై 17వ తేదీ ఉజ్జయిని మ‌హంకాళి అమ్మవారి బోనాలు నిర్వహించారు. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాల‌యాల ఘ‌ట్టాల ఊరేగింపు జరుగుతాయి. జులై 28న గోల్కొండ బోనాల‌తో ఈ ఉత్సవాలు ముగియ‌నున్నాయి.

Updated Date - 2022-07-22T22:39:38+05:30 IST