నేడు పాతబస్తీలో బోనాల ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-08-01T07:15:54+05:30 IST

పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారితోపాటు పలు దేవాలయాలలో

నేడు పాతబస్తీలో బోనాల ఉత్సవాలు
విద్యుత్‌ వెలుగుల మధ్య లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయం

చాంద్రాయణగుట్ట, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారితోపాటు పలు దేవాలయాలలో ఆదివారం బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి ఆలయాల కమిటీ నిర్వాహకులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవార్ల ఆలయాల నుంచి ప్రధాన చౌరస్తాల వరకు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు స్వాగత వేదికలను ఏర్పాటు చేశారు. ప్రతియేడాది మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారి బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 

బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్‌దర్వాజ, గౌలిపురా, ఛత్రినాక, అలియాబాద్‌, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, అరుంధతి కాలనీ, శాలిబండ తదితర ప్రాంతాలలో ఉన్న ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి 

పాతనగర బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. ఆలయాల వద్ద భక్తులకు బోనం ఎత్తుకున్న మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.

- ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు 

కమిటీ అధ్యక్షుడు బల్వంత్‌ యాదవ్‌ 




Updated Date - 2021-08-01T07:15:54+05:30 IST