కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవార్లకు బోనాల సమర్పణ

ABN , First Publish Date - 2020-04-10T01:23:30+05:30 IST

ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుని అమ్మవార్లకు బోనాలు సమర్పించడం తెలంగాణలో ఆనవాయితీ. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిలా మారిన కరోనా వైరస్‌ను కట్టడి చేయాలని పాతబస్తీవాసులు అమ్మవార్లకు ప్రత్యేకంగా బోనాలు

కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మవార్లకు బోనాల సమర్పణ

హైదరాబాద్‌: ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుని అమ్మవార్లకు బోనాలు సమర్పించడం తెలంగాణలో ఆనవాయితీ. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిలా మారిన కరోనా వైరస్‌ను కట్టడి చేయాలని పాతబస్తీవాసులు అమ్మవార్లకు ప్రత్యేకంగా బోనాలు సమర్పించారు. గురువారం ఉప్పుగూడలోని పటేల్‌నగర్‌ ప్రాంత మహిళలు గురువారం రేణుకా ఎల్లమ్మ, గాలిపోచమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పించడం ద్వారా కరోనా వైరస్‌ నియంత్రిలోకి వస్తుందని ఇక్కడి ప్రజల విశ్వాసం. పటేల్‌నగర్‌ బస్తీ వాసులంతా కలిసి ఉదయం మడికట్టుకుని సంప్రదాయబద్దంగా బోనాలను సిద్ధం చేసుకుని ఒక్కొక్కరూ సామాజిక దూరాన్నిపాటిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. స్థానిక మహిళా ప్రతినిధులు రుక్మిణి, నర్సమ్మ, అంజమ్మ తదితరులు బోనాల వేడుకలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన తెలంగాణ భారత దేశాన్ని కరోనా నుంచి విముక్తి చేయాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటేల్‌ నగర్‌ సంక్షేమ సంఘం నాయకులు సత్యనారాయణ, అర్జున్‌, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-04-10T01:23:30+05:30 IST