కలెక్టరమ్మా.. ఇటు చూడమ్మా..

ABN , First Publish Date - 2022-08-20T06:38:40+05:30 IST

బొమ్మూరు మహిళా ప్రాంగణం ఒకప్పుడు పెద్ద పేరు.. ఎంతో మంది మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చిన కేంద్రం నేడు ఎందుకూ కొరగాకుండా పోతోంది.

కలెక్టరమ్మా.. ఇటు చూడమ్మా..
బొమ్మూరు మహిళా ప్రాంగణం

నిరుపయోగంగా బొమ్మూరు మహిళా ప్రాంగణం

ఉపాధి శిక్షణ లేదు..  కేంద్రం నిర్వహణ లేదు

నీరు గారుతున్న లక్ష్యం.. పట్టించుకోని అధికారగణం


బొమ్మూరు, ఆగస్టు 19 : బొమ్మూరు మహిళా ప్రాంగణం ఒకప్పుడు పెద్ద పేరు.. ఎంతో మంది మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చిన కేంద్రం నేడు ఎందుకూ కొరగాకుండా పోతోంది. కలెక్టర్‌కు కనిపించేటంత దూరంలో ఉన్నా ఆ కేంద్రం గురించి పట్టించుకున్నవారే లేరు. మహిళలు తమ కాళ్లపై నిడబడాలనే ఉద్దేశంతో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నేతృత్వంలో ఎన్‌టీఆర్‌ 1990లో మొట్టమొదటిసారి బొమ్మూరులో మహిళా ప్రాంగణాన్ని  స్థాపించారు. నాటి నుంచి ఎంతో మహిళల ఉపాధి శిక్షణకు కేంద్ర బిందువైంది. రాను రాను కేంద్రంలో శిక్షణలు తగ్గిపోతూ వచ్చాయి. కొవిడ్‌ దెబ్బతో అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఆ కేంద్రాన్నే మర్చిపోయారు. దీంతో ప్రాంగణంలో పగిలిన గోడలు, విరిగిన కిటికీలు, పగిలిన అద్దాలు, బూజు పట్టిన మిషన్లు మాత్రమే మిగిలా యి. 2020లో కోర్సులు ప్రారంభమైనప్పటికి లాక్‌డౌన్‌ కారణంగా సెప్టెంబర్‌ వరకు శిక్షణలు జరగలేదు. అక్టోబర్‌ నుంచి 2021 ఏప్రిల్‌ వరకు మూడు శిక్షణలు, డిపార్టుమెంట్‌ కార్యక్రమాలు జరిగాయి. 2022లో జనవరి నుంచి ఇప్పటి వరకు ఏ కోర్సులు లేకుండా ప్రాంగణం ఖాళీగా ఉంది. ప్రాంగణంలో పది మంది సిబ్బందికి ప్రస్తు తం  అకౌంటెంట్‌, అటెండర్‌ మాత్రమే మిగిలారు. 2014 నుంచి పోస్టుల భర్తీ నిలిచిపో వడంతో ఇద్దరే అంతా చూ సుకుంటున్నారు. గతంలో జిల్లా మేనేజర్‌ సస్పెన్షన్‌ కార ణంగా రాజమహేం ద్రవరం ఐసీడీఎస్‌ సీడీపీవో నర్సమ్మ ఇన్‌ఛార్జ్‌ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్నారు.దీంతో పాటు పది ఎకరాల విస్తీర్ణంగల ప్రాంగణంలో ఐదు ఎకరాలు సైన్సు మ్యూజియంకు కేటా యించారు. మహిళా ఉద్యోగి నుల వసతి గృహం కాస్తా కొత్త జిల్లా ఏర్పాటులో డీఎంహెచ్‌వో, ఉమన్‌ అండ్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కార్యా లయాలకు కేటాయించారు.ఇప్పుడు పాత భవనం తప్ప ప్రాంగణం అని చెప్పుకోవడానికి ఏమి లేదు. మహిళలు ఉపాధి శిక్షణకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 2016 నుంచి భవనాలు, సమస్యలపై స్కిల్‌డవలప్‌మెంట్‌ కార్పొ రేషన్‌కు ప్రతిపాదనలు పంపినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కొత్త జిల్లా ఏర్పడిన తరుణంలో జిల్లా యంత్రాంగం కేంద్రంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారులు ఐదు నిమిషాలు సమయం కేటాయిస్తే మహిళా ప్రాంగణ పూర్వ వైభవం సంతరించుకుంటుంది.


కలెక్టర్‌ దృష్టికి సమస్యలు..


ప్రాంగణంలో వివిధ కోర్సులకు మహిళలు ఎదురు చూస్తున్నారు.  ఉపాధి శిక్షణపై ఏపీ ఎస్‌ఎస్‌డీసీ డైరక్టర్‌కు తెలియజేస్తాం. ప్రాంగ ణంలో సమస్యలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం. మహిళలకు కోర్సులు త్వరలో అందించే విధంగా చర్యలు తీసుకుంటాం.         సీహెచ్‌వీ.నర్సమ్మ, ఇన్‌ఛార్జ్‌  మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్‌


Updated Date - 2022-08-20T06:38:40+05:30 IST