బొమ్మిడాయిలు పాలకూర

ABN , First Publish Date - 2020-09-19T19:19:07+05:30 IST

వానలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో ఘూటుగా ఉండే నాన్‌ వెజ్‌ రుచులను ఆస్వాదిస్తే వచ్చే మజాయే వేరు. అందులోనూ పాయ, కోడి పులావు, చికెన్‌

బొమ్మిడాయిలు పాలకూర

అసలైన తెలుగు రుచులు

వానలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో   ఘూటుగా ఉండే నాన్‌ వెజ్‌ రుచులను ఆస్వాదిస్తే వచ్చే మజాయే వేరు. అందులోనూ పాయ, కోడి పులావు, చికెన్‌ కర్రీ, బోటీ చారు లాంటి తెలుగు వంటకాలు రుచి చూడాల్సిందే...


కావలసినవి: ఎండు బొమ్మిడాయిలు - 4, పాలకూర తరుగు - 2 కప్పులు / 4 కట్టలు, ఉల్లిపాయలు - 3,  పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 2 రెబ్బలు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, గరంమసాలా పొడి - పావు టీస్పూన్‌, చింతపండు పులుసు - పావు కప్పు, ఉప్పు - తగినంత, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ: బొమ్మిడాయిలు తల, తోకా తీసేసి మూడు అంగుళాల ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత పెనంలో కొద్దిగా నూనె వేసి వీటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె లేదా కడాయిలో మిగిలిన నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేగించాలి. పాలకూర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కలపాలి. తర్వాత వేగించిన బొమ్మిడాయి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి... ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత పాలకూర తరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. నీళ్లు అవసరముంటే కొద్దిగా పోయాలి. బొమ్మిడాయిలు, పాలకూర ఉడికి దగ్గరగా అయిన తర్వాత చింతపండు పులుసు, గరం మసాలా పొడి వేసి కలిపి చిన్నమంట మీద మరి కొద్దిసేపు ఉడికించి దింపాలి. 


పోషక విలువలు 100గ్రా.లలో

బొమ్మిడాయిలు

ప్రొటీన్‌ - 18.44 గ్రా

క్యాలరీలు - 184

ఫ్యాట్‌ - 11.66 గ్రా


జ్యోతి వలబోజు

ఫోన్‌: 8096310140








Updated Date - 2020-09-19T19:19:07+05:30 IST