‘షకలక’ శంకర్ హీరోగా రూపుదిద్దుకొంటున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘బొమ్మ అదరింది-దిమ్మ తిరిగింది’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రియ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. షకలక శంకర్ మార్క్ కామెడీ సహా యూత్‌ని ఆకట్టుకొనే అంశాలతో చిత్రం రూపుదిద్దుకుంటోందని దర్శకుడు కుమార్ కోట చెప్పారు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు లుకాలపు మధు, సోమేశ్ ముచ్చర్ల తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: దత్తి సురేశ్‌బాబు, సమర్పణ: మహంకాళి దివాకర్.